జ‌గ‌న్ స‌వాల్‌ కు ఒక్క‌రు నోరు విప్ప‌ట్లేదే

Update: 2017-11-09 16:31 GMT
రాజ‌కీయాల్లో స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు కామ‌న్.  అవినీతి.. అవినీతి అంటూ అదే ప‌నిగా మాట్లాడుతూ ఏపీ విప‌క్ష నేత‌ను డిఫెన్స్ లో ప‌డేస్తున్నామంటూ సంతోష‌ప‌డే బ్యాచ్‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన షాక్ అలాంటి ఇలాంటి కాదు. ఒక్క‌సారి ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ అయిపోయిన ప‌రిస్థితిగా చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్యార‌డైజ్ పేప‌ర్ల‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు ఉన్న‌ట్లుగా తెలుగు దేశం వారు ఆరోపణలు చేసారు. పాద‌యాత్ర దెబ్బ‌కు ఏమ‌వుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లో ఉన్న వేళ‌..ప్యార‌డైజ్ పేప‌ర్ల‌లో జ‌గ‌న్ పేరు అంటూ త‌మ్ముళ్లు మైకుల ముందుకు వ‌చ్చేశారు.

ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. విన్నంత వ‌ర‌కూ విన్న జ‌గ‌న్ ఒక్క‌సారిగా గొంతు స‌ర్దుకొని.. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల సాక్షిగా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. ఆయ‌న పార్టీ నేత‌ల‌కు భారీ స‌వాలు విసిరారు. తన‌కు సంబంధించిన రూపాయి విదేశాల్లో ఉన్న‌ట్లుగా నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి శాశ్వితంగా త‌ప్పుకుంటాన‌ని స‌వాలు విసిరారు. ఇందుకు టైం కూడా ఇచ్చారు.

చేతిలో ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు.. ఒక‌వేళ విప‌క్ష నేత అవినీతి చేసి ఉంటే.. ఇదిగో ఇక్క‌డ అవినీతి చేశార‌ని చూపించే వీలుంది. దీంతో.. జ‌గ‌న్ స‌వాలుకు ఒక్క‌సారిగా సంచ‌ల‌న‌మైంది. ఇంత తీవ్ర‌స్థాయిలోఈ మ‌ధ్య కాలంలో ఏ పార్టీ అధినేత స‌వాలు విస‌ర‌లేద‌ని చెప్పాలి. వాస్త‌వానికి లాంటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా రియాక్ట్ అవుతారు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా తెలుగు త‌మ్ముళ్లు ఎవ‌రూ నోరు విప్ప‌ని ప‌రిస్థితి.

ఎందుకంటే.. నోరు విప్పితే స‌వాలు స్వీక‌రిస్తున్న‌ట్లు చెప్పాలి. అదే చెబితే.. స‌వాలు కానీ నిరూపించ‌లేక‌పోతే చంద్ర‌బాబు త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. చూస్తూ.. చూస్తూ అంత సాహ‌సం చేయ‌లేరు క‌దా. అందుకే.. నోరు విప్ప‌కుండా మౌనంగా ఉండిపోయారు. అందుకే అనేది.. వెనుకా ముందు చూసుకోకుండా క‌దిలిస్తే ఇలాంటి తిప్ప‌లే ఎదుర‌వుతాయి. ఈ గుణ‌పాఠాన్ని త‌మ్ముళ్లు ఇప్ప‌టికైనా త‌ల‌కెక్కించుకుంటారో లేదో?
Tags:    

Similar News