నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేబినెట్ తొలి కూర్పులోనే దివంగత ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. తొలిసారి మంత్రి పదవి అందుకున్న అచ్చెన్న తన వాగ్దాటితో చంద్రబాబును ఆకట్టుకున్నారు. దీంతో అచ్చెన్నకు చాలా ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఇది అచ్చెన్నను పవర్ ఫుల్ మినిష్టర్ ను చేసింది.. సీనియర్ మంత్రులకు కన్ను కుట్టింది. అచ్చెన్న తమ శాఖల్లో వేలు పెడుతున్నారన్న ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. దానికితోడు అచ్చెన్న సొంత జిల్లా శ్రీకాకుళం టీడీపీ సీనియర్ల నుంచి కూడా చంద్రబాబుకు నిత్యం కంప్లయింట్లు వస్తున్నాయట. ఇవన్నీ ప్రభావం చూపించడంతో అచ్చెన్నకు గత ఆర్నెళ్లుగా చంద్రబాబు నుంచి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. రెండేళ్ల హానీమూన్ పీరియడ్ ముగిసిపోయి చంద్రబాబుతో రోజూ చీవాట్లు పడుతున్నా అచ్చెన్నలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు మెల్లమెల్లగా అచ్చెన్నకు ప్రయారిటీ తగ్గిస్తున్నారని టాక్. తాజాగా మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్సు ఆయన్నుంచి తప్పించడం వెనుకా ఇదే రీజనుందని తెలుస్తోంది.
మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ఈసారి మంత్రి అచ్చెన్నాయుడికి బదులు మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి మండలిలో వేరే మంత్రులు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఇంతవరకు ఏటా ఆ బాధ్యతను అచ్చెన్నాయుడికే అప్పగిస్తున్నారు చంద్రబాబు. కానీ.. ఈసారి మాత్రం అచ్చెన్నను కాదని అయ్యన్నపాత్రుడికి ఇచ్చారు. దీనిపై టీడీపీలోనూ చర్చ నడుస్తోంది. అచ్చెన్నపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉండడం వల్లే ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.
అచ్చెన్నాయుడి పట్ల చంద్రబాబు ధోరణి మారడానికి, ఆగ్రహించడానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. ఇటీవల పలుమార్లు అచ్చెన్న కేబినెట్ భేటీల్లో ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మిగతా శాఖల సంగతి నీకెందుకంటూ మండిపడుతున్నారు. పాలనలో లోపాలను ఎత్తిచూపడం వల్లే అచ్చెన్నపై చంద్రబాబుకు ఆగ్రహం ఉందని.. ఇతర మంత్రులు చేస్తున్న ఫిర్యాదులు దీన్ని మరింత పెంచుతున్నాయని చెబుతున్నారు. ఏదైనా ఈసారి మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యేవారిలో అచ్చెన్న గ్యారంటీగా ఉంటారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/