పదినెలల ఆలస్యం; టీటీడీ ఛైర్మన్‌ చదలవాడే

Update: 2015-04-11 13:35 GMT
మాట మీద నిలబడే వంశం మాది. చంద్రబాబుకు లేనిది మాకు మాత్రమే ఉన్నది ఇదే అంటూ వైఎస్‌ ఫ్యామిలీ తరచూ బాబు మీద విరుచుకుపడుతుంటుంది. తాను కూడా మాట మీద నిలబడే వాడినని బాబు చెప్పుకున్నా.. ఆయన ఆ మాట నిరూపించుకునే అవకాశం ప్రతిపక్ష నేతగా ఆయనకు రాలేదు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తాను ఇచ్చిన మాటల్ని చాలానే నెరవేర్చాల్సి ఉంది.

తన చేతికి అధికారం కానీ రావాలే కానీ.. చాలానే చేస్తానంటూ చాలామందికి చాలానే హామీలు ఇచ్చారు. అలాంటి వాటిల్లో ఒకటి టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తికి అవకాశం. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ఛైర్మన్‌ అయ్యే అవకాశం ఇస్తానన్న ఆయన.. చివరకు తన మాట నిలబెట్టుకున్నారు. కాకపోతే.. పది నెలల ఆలస్యంగా ఖరారు చేశారు.

టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తానని చదలవాడకు చంద్రబాబు గతంలోనే మాట ఇచ్చారు. అయితే.. ఆ పదవి కోసం పలువురు పోటీ పడిన నేపథ్యంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు చెప్పుకునే క్రమంలో పది నెలల పుణ్యకాలాన్ని పూర్తి చేసి.. తాజాగా ఛైర్మన్‌ గిరి గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం చదలవాడకు ఇచ్చారు. అంతేకాదు.. కీలకమైన టీటీడీ పదవుల్లో ఆంధ్రా.. తెలంగాణ..తమిళనాడు.. కర్ణాటకకు చెందిన వారికి స్థానం కల్పించనున్నారు. మిత్ర ధర్మంలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేతలకు కూడా ఆయన అవకాశం ఇచ్చారు.

అధికారికంగా ప్రకటించకున్నా.. ఒక జాబితాను బాబు సిద్ధం చేశారని.. తన వెంట ఉంచుకున్న ఆ జాబితాను ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు. చైనా పర్యటలకు వెళ్లే ముందే ఉంటుందా? లేక వచ్చిన తర్వాత ఉంటుందా? అన్న విషయంపై మాత్రం సందిగ్థత వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన ఏదో పది నెలల ముందే ప్రకటించి ఉంటే.. రో రెండు నెలల్లో ఒక ఏడాది పూర్తి అయ్యేదన్న విమర్శ మాత్రం వినిపిస్తోంది. 18 మందితో కూడిన జాబితాలోబోర్డు సభ్యులుగా ఉండనున్నారు.

I బండా ఉమ

I భాను ప్రకాష్‌రెడ్డి

I గౌతు శ్యామసుందర్‌ శివాజీ

I పిల్లి అనంత లక్ష్మి

I కోళ్ల లలితకుమారి

I చింతల రామచంద్రారెడ్డి (తెలంగాణ)

I సాయన్న (తెలంగాణ)

I సండ్ర వెంకట వీరయ్య తదితరులు.



Tags:    

Similar News