ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రపై విచారణ జరపమని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబు తర్వాతి స్టెప్ పై ఆసక్తి నెలకొంది. గవర్నర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ వెనుక మర్మం ఇదే కేసు అనే చర్చలు వినిపించగా బాబు ఏం నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కనున్నారని తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే కారణం కావడం ఆసక్తికరం.
తనపై ఏసీబీ ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్ - న్యాయ సలహాదారులు తదితరులతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి సమయంలో భేటీ అయినట్టు అక్కడి పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎఫ్ ఐఆర్ లో పేరు నమోదు చేస్తే ఎలాగైనా విచారణను ఆపించేందుకు ప్రయత్నించాలని, ఇందుకు ఉన్న మార్గాలపై తనకు చెప్పాలని ఆదేశించారని తెలుస్తున్నది. ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన సమయంలో ఏర్పాటుచేసిన సిట్ ను మళ్లీ రంగంలోకి దించడం - ట్యాపింగ్ అంశాన్ని మళ్లీ ముందుకు తేవడంతోపాటు.. రాజకీయంగా ఎదురుదాడి చేసేలా కూడా వ్యూహాలు రచించాలని అధికారులకు - తన ఆంతరంగికులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఇదిలాఉండగా ఓటుకు నోటు కేసు విషయమై ఎక్కువగా మాట్లాడ్డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓటుకు నోటు కేసు విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. క్లుప్తంగా సమాధానం చెప్పారు. ఏసీబీ ఈ కేసును వచ్చే నెల 29లోగా విచారించాలని ఆదేశించింది కదా? అని మీడియా ప్రశ్నించగా, ‘అందులో ఏముంది? మీరు చదివారా? ఏం చేస్తారు? అంతా మా లాయర్ చూసుకుంటారు.’ అని సమాధానం చెప్పి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.