డేట్ ఫిక్స్.. 29న మంత్రివర్గ విస్తరణ

Update: 2017-03-03 06:30 GMT
మంత్రివర్గం విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 29న కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించి కొలువుదీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఈలోగా మండలి ఎన్నికలు పూర్తవు తాయి కాబట్టి అందులో గెలిచినవారి నుంచి కొందరికి ఛాన్సివ్వాలన్న బాబు ఆలోచనకు కార్యరూపం వస్తుంది.
    
ఇప్పటికే ఆరు నుంచి ఏడుగురు మంత్రుల పనితీరు పట్ల బాబు పదేపదే బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో విఫలం అవుతున్నారంటూ మండిపడుతున్నారు. కొందరు అంతర్గత కలహాలకు దోహదపడుతున్నారన్న అభిప్రాయం కూడా చంద్రబాబుకు ఉంది.  విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తగిన విధంగా మంత్రులు స్పందించడం లేదన్న ఆందోళన కూడా నెలకొంది. కొందరు మంత్రులను తొలగించడంతో పాటు కొందరికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది.  ఇటీవల కాలంలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి చాయలు తగ్గుముఖం పడుతున్నట్లు వేదికలు చెబుతున్నాయి. ఈదశలో పునర్వవ్యవస్దీకరణ తప్పదన్న నిర్ణయానికి సిఎం వచ్చేశారు.
    
కాగా ఎవరెవరికి ఉద్వాశన ఉంటుంది.. ఎవరెవరికి ఛాన్సు ఉంటుందన్న విషయంలో పార్టీలో ఇప్పటికే స్పష్టత వచ్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పలువురు నేతలు మంత్రి పదవుల కోసం ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ వద్ద రోజూ హాజరు వేయించుకుంటున్నారు. లోకేశ్ సిఫార్సుతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేతకు బెర్తు కన్ఫర్మయినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News