అనాధి నుంచి అదే కథ.. రాజకీయాల్లోకి వచ్చాక భయం - భక్తి ఉండాలంటారు. భక్తి సంగతేమో కానీ.. భయాన్ని మాత్రం రాజకీయ నేతలు బాగానే వ్యాపింప చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసే విషయాల్లో ఇరుకున్న ప్రభుత్వాధినేతలు ఆ గోతిలోంచి బయటకు రావడానికి అడ్డుగా ఉన్న వారందిరీని భయపెట్టే ప్రయత్నాలను మొదలుపెడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అదే ధోరణి అవలంభిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ‘ఇప్పుడు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవాన్ని’ ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.. అందుకే ఆయన తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు.. బెదిరింపులకు గురిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న కేసీఆర్ ఓడిపోతాడంటూ తాజాగా నిన్న బాబు చేసిన ప్రచారాన్ని ‘గోబెల్స్’ ప్రచారంగా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగాక.. అది హైకోర్టు కెక్కాక.. ఎక్కడ సీబీఐ విచారణ జరుగుతుందో.. ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న భయం దీనికి కారకులైన వారిని వెంటాడుతోందని చెబుతున్నారు.. అంతేకాకుండా తెలంగాణలో అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసు ఉండనే ఉంది. వీటన్నింటిని అధికార బలంతో మాఫీ చేసుకుందామన్న ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ పెద్ద మనిషి మోకాలడ్డడంతో రెంటికి చెడ్డ రేవడిలా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. అందుకే మోడీతో విడాకులు తీసుకొని ఆగర్భ శత్రువుతో చేరినా కూడా ఆ నేత తలరాత మారడం లేదు.. ఓడిపోయే పార్టీని పక్కన పెట్టుకొని ఇప్పుడు తెలంగాణలో గెలిచే అవకాశాలున్న వారిపై తప్పుడు ప్రచారం చేస్తూ భయపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట.. తెలంగాణలో అయినా.. దేశంలో అయినా ఆయన వ్యతిరేకులు అధికారంలోకి వస్తే ఆయన ఖేల్ ఖతం కావడం ఖాయమే.. అందుకే తన రక్షణ కోసం కూటమిలో కలిశాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతే తప్పితే ఏపీ ప్రయోజనాలు - హోదా గట్రా వేటి కోసం కాదనేది ప్రతిపక్ష నేతల మాట.. వాటి పేరు చెబుతూ సొంత ప్రయోజనాలను బాబు కాపాడుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు కూడా అదే ధోరణి.. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సైకిల్ పార్టీ వెళుతోంది. ఒకవేళ కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. ఓటుకు నోటు కేసులో కదలిక రావడం తథ్యం.. కారకులైన వారు చిక్కుల్లో పడడం ఖాయం. అందుకే ఓడించడానికి ఉన్న అన్ని ‘ప్రయత్నాలు’ ఆయన గారు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. టీఆర్ ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని.. కేసీఆర్ అతివిశ్వాసంతో ఒకేసారి 105 సీట్లు ప్రకటించాడని .. దెబ్బైపోవడం ఖాయమని భయపెడుతున్నాడు. ప్రజా కూటమిదే గెలుపు అంటూ బీరాలు పలుకుతున్నాడు.
నిజానికి కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఆయన పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు. తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని తాకిన కేసీఆర్ సంక్షేమ జల్లు ఖచ్చితంగా గులాబీ పార్టీని గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ పక్క రాష్ట్రం నేత మాత్రం కేసీఆర్ ను ఢిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు..తాజాగా ఆ పార్టీ వ్యూహ కమిటీలో కేసీఆర్ దూకుడుపై వ్యాఖ్యానాలు కూడా చేశారు అధినేత. మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ నమ్మకం గెలుస్తుందా.? పగబట్టిన ఆ నేత అతివిశ్వాసం పనిచేస్తుందా చూడాలి మరి.