త‌మ్ముళ్ల నిర్ల‌క్ష్యంపై ఓపెన్ అయిన బాబు

Update: 2017-05-02 10:05 GMT
ఏపీ అధికార‌ప‌క్షంలో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ మ‌ధ్య కాలం అధినేత‌పై అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ‌కున్న అసంతృప్తిని ఏ మాత్రం దాచుకోకుండా బ‌య‌ట పెట్టేస్తున్నారు. ప‌వ‌ర్ లో లేన‌ప్పుడు ఇలాంటివి మామూలే అయినా. ప‌వ‌ర్‌ లో ఉండి.. త‌న‌కు తిరుగులేద‌ని బాబు త‌ర‌చూ చెప్పుకుంటున్న వేళ‌.. సొంత పార్టీ నేత‌ల నోటి మాట‌లు అందుకు భిన్నంగా ఉండ‌టం ఆయ‌న్ను తీవ్రంగా క‌లిచివేసేలా చేస్తున్నాయి. త‌మ్ముళ్ల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న సైతం త‌న‌లోని అస‌హ‌నాన్ని.. అసంతృప్తిని ఏ మాత్రం దాచి పెట్టుకోకుండా బ‌య‌ట‌పెట్టేసుకోవ‌టం విశేషంగా చెబుతున్నారు.

ఏదైనా అసంతృప్తి ఉంటే త‌న దృష్టికి తీసుకురావాలే కానీ.. మీడియా ముందు ఓపెన్ కావొద్ద‌ని చెప్పే చంద్ర‌బాబు.. తాను చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా మాట‌లు చెబుతుండ‌టంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో కొంద‌రు నేత‌లు ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని.. అగ్రనేత‌ల నుంచి కిందిస్థాయి నేత‌ల వ‌ర‌కూ అంద‌రిలోనూ నిర్ల‌క్ష్యం పెరిగిపోయింద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

పార్టీ నేత‌ల నిర్ల‌క్ష్యాన్ని కంట్రోల్ చేసే బాధ్య‌త మొత్తం త‌న చేతుల్లో ఉన్నా.. దాన్ని స‌రిగా వినియోగించ‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. పార్టీ నేత‌ల తీరును త‌ప్పు ప‌ట్ట‌టం.. అది కూడా బాహాటంగా మాట్లాడ‌టం ఏమిట‌న్న విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ  నేత‌ల మీద అధినేత ఇలాంటి వ్యాఖ్య‌లు ఓపెన్ గా వ్యాఖ్యానించ‌టం ఏమాత్రం స‌బ‌బు? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. గీత దాటిన నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునే తాళాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నా.. వాటిని ఉప‌యోగించ‌ని అధినేత‌.. మీడియా ఎదుట పార్టీ నేత‌లు క‌ట్టు త‌ప్పుతున్నార‌న్న మాట‌ను చెప్ప‌టం అంటే.. పార్టీ నేత‌ల్ని తాను స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతున్నాన‌న్న విష‌యాన్ని బాబు త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో ఒప్పుసుకున్న‌ట్లా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు చంద్ర‌బాబు. త‌న‌తో ఫోన్లో మాట్లాడే నేత‌లు.. సోష‌ల్ మీడియాను  కూడా ఫాలో కావాల‌ని ఆయ‌న సూచ‌న చేశారు. ఏమైనా పార్టీకి సంబంధించిన అంశాల్ని ఓపెన్ గా వ్యాఖ్యానించ‌టం ఏమాత్రం స‌రికాద‌న్న మాట‌ను టీడీపీ నేత‌లు కొంద‌రు ఆఫ్ ద రికార్డుగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తోంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News