నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు అందజేసిన వారంతా తనకు అత్యంత ప్రియమైన వారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రం రాజధాని రైతులకు మూలధన లాభంలో పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. నా పిలుపు మేరకు రైతులు భూ సమీకరణలో భూములిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎవరు రెచ్చగొట్టినా.. రైతులు తనపై విశ్వాసంతో భూములిచ్చారని, వారందరికీ రుణపడి ఉంటానని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్ణయంతో రైతులకు మేలు జరిగిందని, . రాజధానికి భూములిచ్చిన రైతులకు దాదాపు రూ.2కోట్ల లాభం వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు.
దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించే అంశాలు బడ్జెట్‌లో చాలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ - ఎస్టీ - మైనార్టీలు - మహిళలు - యువతకు ప్రాధాన్యత ఇచ్చారని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. నాబార్డు కార్పస్ మరో రూ.40వేల కోట్లు పెంచారన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచారన్నారు. ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించే అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారని చంద్రబాబు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/