ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో ఓనమాలు దిద్దారు.. ఒకే పార్టీలో ఎదిగారు.. పరిస్థితులు కలిసొచ్చి ఒకరు ఇతర పార్టీకి వెళ్లి అతడి కూతుర్ని పెళ్లి చేసుకుని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. మరొకరు పుట్టిన పార్టీలోనే ఉంటూ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేసి.. సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి వీరిద్దరూ పార్టీలపరంగా శత్రువులు కానీ వ్యక్తిగతంగానే మిత్రులు. ఈ విషయమై పలుసార్లు వైఎస్సార్ - చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు కూడా.
అయితే రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు తన స్నేహితుడి కుమారుడు వైఎస్ జగన్ చేతిలో దారుణంగా ఓడిపోయి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి సీటులో కూర్చున్నాడు. ఈ సమయంలో నాడు వైఎస్సార్ చేతిలో విమర్శల పాలైన చంద్రబాబు ఇప్పుడు జగన్ చేతిలోనే అదే పరిస్థితి ఎదుర్కొంటారు. అయితే తాజాగా చంద్రబాబు గతాన్ని గుర్తుచేసుకున్నారు. తన స్నేహితుడు వైఎస్సార్ ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు కురిపించాడు చంద్రబాబు. చిరకాల ప్రత్యర్థి అయినా తన చిరకాల మిత్రుడు వైఎస్సార్ అని గుర్తుచేసుకున్నాడు.
ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన నిరసన కార్యక్రమంలో చంద్రబాబు హాజరై మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ - వైఎస్సార్ కు మధ్య తేడాలను చెప్పే క్రమంలో చంద్రబాబు వైఎస్సార్ పై ప్రశంసలు కురిపించాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్సార్ విమర్శలు చేసే వాడు. మళ్లీ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకునే వాడని పేర్కొన్నాడు. విమర్శించే వారు కానీ ఎప్పడూ మనసును నొప్పించే వారు కాదని వైఎస్సార్ గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. హైటెక్ సిటీ - సైబరాబాద్ - శంషాబాద్ విమానాశ్రయం విషయంలో వైఎస్సార్ విమర్శలు చేశారు.. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక వాటిని అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. కానీ
నేడు జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నాడని విమర్శలు చేశారు. తుగ్లక్ పాలనను జగన్ గుర్తు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. తాను శివ రామకృష్ణన్ కమిటీని పరిశీలించి ఉద్యోగులతో పాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిగా అమరవాతిని ఎంపిక చేసినట్లు వివరించారు.