టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న వైనం తెలిసిందే. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు ఏపీ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా టార్గెట్ చేస్తూ... కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఘీంకరిస్తున్నారు. ఆవేశపూరితంగా మాట్లాడుతున్న చంద్రబాబు... టీడీపీ శ్రేణుల్లో ఈ దఫా కూడా టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనన్న కసిని పెంచేస్తున్నారు. ఇంతగా ఆవేశంగా మాట్లాడుతున్న చంద్రబాబు... అప్పుడప్పుడు చెణుకులు - చమక్కులు విసురుతూ నవ్వులు కూడా పూయిస్తున్నారు.
తన సభలకు హాజరవుతున్న పార్టీ శ్రేణులతో పాటు ఓటర్లకు కూడా కాస్తంత ఆహ్లాదాన్ని పంచుదామన్న కోణంలో ఆలోచిస్తున్న చంద్రబాబు సెటైరిక్ గా కూడా మాట్లాడుతూ నవ్వులు పండిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్ షో - బహిరంగ సభలకు హాజరైన చంద్రబాబు.. ఈ రీతిననే సెటైరికల్ గా మాట్లాడారు. తొలుత పవన్ కల్యాణ్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిని ప్రస్తావించిన చంద్రబాబు.. తాను అందరినీ అత్తారింటికి పంపుతుంటే... పవన్ కల్యాణ్ మాత్రం తన దారి తాను వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీడీపీని ఢీకొట్టే వారు ఎవరూ లేరన్న అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... అదిరిపోయే వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ గుర్తు సైకిల్ ను ముట్టుకుంటే కరెంట్ షాక్ తగుతులుందని చెప్పిన చంద్రబాబు... అసలు తన సైకిల్ ను ఎవరూ తాకలేరని కూడా చెప్పుకొచ్చారు. ఈ కోణంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే... *నా సైకిల్ ను తాకితే షాక్ తింటారు - నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్! అలాంటి సైకిల్ చెయిన్ ను ఎవన్నా తెంపగలరా? వాళ్లను నేను వదిలిపెడతానా?" అంటూ తనదైన ప్లాన్ కొనసాగించారు.