టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ల గురించి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నారని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడినప్పటికీ...ప్రస్తుత పరిస్థితులకు అవి ఏమాత్రం సూట్ అవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఇదంతా దేనిగురించి అంటే...ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు - కేంద్ర కమిటీ సభ్యులు - ఉపాధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులు - అధికార ప్రతినిధులు - జిల్లా అధ్యక్షులు - అనుంబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి.
సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తెలంగాణలో అవకాశాలు ఉన్నాయని వివరించారు. విభజన వంటి క్లిష్ట సమయంలో కూడా 2014 ఎన్నికలలో టీడీపీ రాష్ట్రంలో 22 శాతం ఓట్లు వచ్చాయని...అన్ని కమిటీలను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలకు సంఘీభావం తెలుపుతూ సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నెలరోజుల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ ల నియామకం - జిల్లా అధ్యక్ష పదవులు - లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్ ల నియామకం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ ఎన్ టీఆర్ వర్ధంతి నుంచి మార్చి 29 పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు 70 రోజులు పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీలో చేరేందుకు తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని - త్వరలో వారిని పార్టీలో చేర్చుకుందామని చంద్రబాబు అన్నారు. మూడున్నరేళ్లలో ఏపీలో చేయాల్సిన పనులన్నీ చేసామని - వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికారంలో తప్పకుండా వస్తామని నేతలతో చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిగిలిన ఏడాదిన్నర తెలంగాణపైనే దృష్టి పెట్టనున్నట్లు చంద్రబాబు చెప్పారు. హెచ్ ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశం సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ సలహాదారు ఇవాంకాతో పాటు వచ్చిన జీఈఎస్ ప్రతినిధులందరూ టీడీపీ వేసిన రోడ్లపైనే తిరిగారని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ గురించి చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం కొత్త విషయం ఏమీ లేనప్పటికీ...పార్టీలో చేరికల గురించి అధినేత ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ నుంచే మెజార్టీ నేతలు ఇటు అధికార టీఆర్ ఎస్ పార్టీ వైపు అటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వైపు చేరుతున్న పరిస్థితుల్లో టీడీపీ వైపు ఎవరు చూడని నేపథ్యంలో వాస్తవాలకు భిన్నంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే..తెలంగాణ పరిణామాలపై బాబు ఆసక్తిని తగ్గించుకున్నారని అర్థం చేస్తోందంటున్నారు.