సుదీర్ఘకాలంగా నిరీక్షణలో ఉంచిన టీటీడీ బోర్డు మెంబర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు పూర్తి చేశారు. టీటీడీ సభ్యుల నియామకం పూర్తి చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇటు ఏపీలో - అటు తెలంగాణలో ఉత్కంఠను సృష్టిస్తున్న ఈ నియామకానికి తన పుట్టిన రోజు సందర్భంగా ఓకే చెప్పేశారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ను ఇప్పటికే ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలంగా నిరీక్షణలో ఉన్న ఎంపీ రాయపాటి సాంబశివరావును సభ్యునిగా ఎంపిక చేశారు.
తాజా నియామకాల్లో ఎమ్మెల్యేలకే చంద్రబాబు పెద్ద పీట వేశారు. ఎమ్మెల్యే జీఎస్ ఎస్ శివాజీ - బోండా ఉమ - అనిత - పార్ధసారధి - సండ్ర వెంకట వీరయ్యకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డికి చాన్స్ ఇచ్చారు. చల్లా రామచంద్రా రెడ్డి - పొట్లూరి రమేష్ బాబు - మేడా రామచంద్రా రెడ్డి - డొక్కా జగన్నాధం తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. మహారాష్ట్ర నుంచి స్వప్న అనే మహిళకు అవకాశం ఇచ్చారు.