ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగు వాడినని చెప్పుకోవటమే కాదు.. తన మాతృభాషకు పెద్దపీట వేసిన రాజకీయ అధినేతలు సమకాలీన రాజకీయాల్లో కనిపించరు. ప్రతిఒక్కరూ తమ మాతృభాషకు సంబంధించి ఎంతోకొంత చేస్తే.. తెలుగు నేల మీద రాజకీయ అధినేతలుగా వ్యవహరించే వారు మాత్రం తెలుగు భాష మీద పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించదు. పక్కనే ఉన్న తమిళనాడులో తమిళంపై పాలకులు ప్రదర్శించే ప్రేమాభిమానాలు చూస్తే.. తెలుగు మీద తమ పాలకులకున్న ప్రేమ ఎంతో ఇట్టే అర్థమైపోతుంది.
మాతృభాష మీద తెలుగు పాలకుల తీరుపై భాషా ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేయటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి విమర్శలకు తాను మినహాయింపు అవ్వాలని భావించారో ఏమో కానీ.. తాజాగా చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై ఏపీలో ఏర్పాటు చేసే శిలాఫలకాలు.. శంకుస్థాపనులు.. ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులో మాత్రమే ఉండాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.
అంతేకాదు.. దుకాణాల పేర్లు కూడా తెలుగులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తమ షాపుల పేర్లు తెలుగులో ఉండేలా యజమానులు చూడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ ఇదే తరహా నిబంధన ఉండేది. కాకుంటే.. ఇంగ్లిష్ లో షాపు పేర్లు పెద్దగా ముద్రిస్తూ.. తెలుగులో అక్షరాల్ని చిన్నవిగా వేస్తున్నారు. తాజాగా.. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏపీలో ‘తెలుగుదనం’ గుబాళించనుందన్నమాట. అంతవరకూ బాగానే ఉంది.. మరి తెలుగు విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏమిటి? చంద్రబాబు బాటలో కేసీఆర్ నడుస్తారా? లేక.. తనదైన శైలిలో సరికొత్తగా రియాక్ట్ అవుతారా? అన్నది చూడాలి.