లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్టులు నార్మన్ అండ్ ఫోస్టర్స్ చేస్తున్న డిజైన్లు అందరికీ నచ్చుతున్నాయి. మరి చంద్రబాబునాయుడు మాత్రం ఒక పట్టాన వాటికి ఓకే చెప్పలేకపోతున్నారు. ఒకసారి ఓకే చెప్పేస్తే.. వెంటనే నిర్మాణాలు ఎందుకు మొదలు కావడం లేదనే సందేహం ప్రజల్లోకి వస్తుందని, ఏతావతా.. తన ప్రభుత్వపు వైఫల్యం బయటపడిపోతుందనే భయం ఆయనను వెన్నాడుతోందని.. గతంలో చాలా పుకార్లు వచ్చాయి. వాటికి తగినట్లే.. బుధవారం లండన్ లో నార్మన్ సంస్థతో రెండో రోజు సమావేశంలో కూడా చంద్రబాబునాయుడు డిజైన్లకు ఏకపక్షంగా ఓటు వేయలేకపోవడం విశేషం. స్తూపాకారంలో చేసిన హైకోర్టు డిజైన్ కు మాత్రం వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబునాయుడు.. అదే సమయంలో అసెంబ్లీ డిజైన్లకు మాత్రం ఆమోదం చెప్పలేదు. ఇంకా పలు రకాల సూచనలు చేసి.. ఆ మేరకు ఇంకా వీలైనన్ని డిజైన్లను రూపొందించి పంపాల్సిందిగా వారికి సూచించి వచ్చారు.
ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని.. డిజైన్లు సిద్ధం అయిన వెంటనే.. నిర్మాణాలు ప్రారంభించాలని కూడా చంద్రబాబునాయుడు హుకుం జారీ చేశారు. నిర్మాణాల ప్రారంభానికి ఎవరు అడ్డు చెప్పారు గనుక! అసెంబ్లీ - హైకోర్టు భవనాల విషయంలో ఇప్పుడింత చర్చ జరుగుతున్నది గానీ.. మిగిలిన కోర్ కేపిటల్ ఇతర భవనాల మాటేమిటి? చివరికి అపార్ట్ మెంట్స్ లాంటి అధికార్ల - ఎమ్మెల్యేల నివాస గృహాల సముదాయాల డిజైన్లను కూడా ఇప్పటిదాకా ఏవీ ఫైనలైజ్ చేయలేదు.
చంద్రబాబునాయుడు వ్యవహార సరళిలో కాలయాపన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వెంటనే నిర్మాణాలు ప్రారంభించేయాలి.. అంటూ వేరెవ్వరో జాప్యం చేస్తున్నట్లుగా చంద్రబాబు హూంకరిస్తారు గానీ.. ఒకవేళ నిర్మాణాలు మొదలుపెట్టదలచుకుంటే.. ఏయే భవనాలు సువిశాలమైన స్థలంలో ఏది ఎక్కడ రావాలో.. నిర్ణయించడం అయినా జరిగిందా? అనేది ప్రజల సందేహం. నిజానికి అదికూడా చాలా కీలక పర్వం.
ఏ భవనం ఎక్కడ వస్తుందో తేలిస్తే.. వాటికి తగ్గట్లుగా మొత్తం అమరావతి నగర స్థలంలో.. రోడ్ల గుర్తింపు జరగాలి.. వాటి మార్కింగ్ చాలా కీలకం అవుతుంది. ఏరియల్ వ్యూలో అయినా నగరం శోభాయమానంగా కనిపించాలంటే.. రోడ్ల ఏర్పాటులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని దానిమీదే ఆధారపడి ఉంటుంది. అసలు నిర్మాణాలు ప్రారంభం అయ్యేలోగా అక్కడిదాకా వాహనాలు గట్రా చేరుకోవడానికి ఎప్రోచ్ రోడ్లు లాంటివి కూడా పూర్తి కావాలి. ఇలాంటి నిర్మాణానికి ముందు జరగాల్సిన పనులే.. నెలల వ్యవధి తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణాత్మకంగా వీటిలో దేనిమీదా దృష్టి పెట్టకుండానే.. ఏదో ప్రజల్ని మభ్యపుచ్చడానికి అన్నట్లుగా డిజైన్ల మీదనే సాంతం డిపెండ్ అయినట్లు కథ నడిపిస్తూ.. డిజైన్లు కొన్ని ఓకే.. కొన్ని నాట్ ఓకే అని.. సాగదీస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.