అసెంబ్లీని నడిపించేది ఎవరు? అదేం ప్రశ్న? కనీస రాజకీయ అవగాహన ఉన్నవారు కూడా స్పీకర్ కదా సభా నాయకుడు అని గట్టిగా చెప్పేస్తారు అంటారా? అవును ఈ సమాధానం నిజమే కానీ ఏపీ అసెంబ్లీలో అందుకు భిన్నమైన సీన్ జరుగుతోంది. ఇదేదో విశ్లేషణ కాదు. సాక్షాత్తుగా లైవ్ టెలీకాస్ట్ ద్వారా అంతా చూసిన నిజం. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు సూచనలకు అనుగుణంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు. చిత్రంగా ప్రధానప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండానే ఈ ప్రక్రియను మూసేశారు.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సభ్యులందరితోటి నీటి సంరక్షణ గురించి ప్రతిజ్ఞ చేయించారు. అయితే దీనికంటే ముందే మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తను మాట్లాడటం ముగిసిన తర్వాత సభను వాయిదా వేయాల్సిందిగా చీఫ్ విప్ కాలువకు బాబు ఆదేశాలు ఇచ్చారు. ఆ వెంటనే సంజ్ఞల ద్వారా సభా వాయిదా విషయాన్ని కాలువ స్పీకర్ కోడెలకు చేరవేశారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రసంగం ముగియడం ఆలస్యం సభ వాయిదా పడిపోయింది. ఇదంతా టీవీల్లో టెలీకాస్ట్ కూడా అవడం గమనార్హం. ఈ క్రమంలో ప్రతిపక్షానికి తమ వాదాన వినిపించే అవకాశమే ఇవ్వకపోవడం కూడా స్పష్టంగా కనిపించింది.
ఈ పరిణామంపై అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ సభా సంప్రదాయాలను పాటిస్తూ శాసనసభ నిర్వహించాలే కానీ ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగానో ఇంకెవరి అభిప్రాయాలను వ్యక్తపర్చకుండా చేసే విధంగా ఉండవద్దని అన్నారు. విపక్షం గొంతునొక్కే విధంగా చేసిన స్పీకర్ చర్యలన్నీ బహిరంగ ప్రపంచానికి తేటతెల్లం అయ్యాయని జగన్ వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/