అంద‌రూ మీలా రాజ‌కీయం చేయ‌లేరు బాబు?

Update: 2018-10-26 14:30 GMT
రాజ‌కీయాల్ని వ‌దిలేద్దాం. సగ‌టుజీవిగా ఆలోచిద్దాం. మీకు.. మీ ప‌క్క‌న ఉన్న వ్య‌క్తికి స‌రిగా మాట‌లు ఉండ‌వు. ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు ఉండ‌వు. అయితే.. ఆ ప‌క్కింటి వ్య‌క్తి పైకి ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి క‌త్తితో పొడిచార‌నుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు? మ‌న‌కెందుకులే అని ఊరుకుంటారా?  లేదంటే.. సాయం చేస్తారా?  లేక‌.. మా చ‌క్క‌గా జ‌రిగిందని సంబ‌ర‌ప‌డ‌తారా?  ఎలాంటి వ్య‌క్తి అయినా..కోప‌తాపాలు.. రాజ‌కీయ విభేదాలు ఉన్నా.. క‌ష్టం వ‌చ్చినంత‌నే అక్కున చేర్చుకుంటారు. అయ్యో అంటారు. కానీ.. అదేం ద‌రిద్ర‌మో కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఇందుకు భిన్నం.

జ‌రిగిన దానిని రాజ‌కీయం చేసి.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇందుకు అవ‌స‌ర‌మైన విష ప్ర‌చారానికి సైతం వెనుకాడ‌రు. అలా అని బాబుకు ఇలాంటి ప‌రిస్థితులు ఎదురుకాలేదా? అంటే.. 2003లో అధికార‌ప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో మావోలు ఆయ‌న‌పై అలిపిరి ద‌గ్గ‌ర దాడి చేశారు.

దాడి జ‌రిగిన వెంట‌నే.. నాడు ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హుటాహుటిన తిరుప‌తికి వెళ్లి  చంద్ర బాబును ప‌రామ‌ర్శించారు. ఆయ‌న బాగోగుల గురించి ఆరా తీశారు. అక్క‌డితో ఆగ‌ని వైఎస్‌.. న‌ల్ల బ్యాడ్జి పెట్టుకొని నిర‌స‌న చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దాడులేంటి? అంటూ మండిప‌డ్డారు.

మ‌రి..మావోల చేతిలో దాడికి గురైన‌ చంద్ర‌బాబు ఏం చేశారు? అంటే.. త‌న‌పై జ‌రిగిన దాడిని సానుభూతిగా మార్చుకోవాల‌న్న ప్లాన్ చేశారు. మావోలు జ‌రిపిన దాడిలో చావు అంచు వ‌ర‌కూ వెళ్లిన బాబు.. త‌న‌పై జ‌రిగిన దాడిని వ‌ర్ణిస్తూ.. దాన్ని సాకుగా చేసుకొని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

సానుభూతిని క్యాష్ చేసుకోవ‌టం.. దాని ద్వారా ల‌బ్థి పొందాల‌నుకోవ‌టం బాబుకు మొద‌ట్నించి అల‌వాటే. అలిపిరి ఎపిసోడ్ దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నం. అయితే..బాబు వేసిన ఈ కుయుక్తిని తెలుగు ప్ర‌జ‌లు ఛీద‌రించుకోవ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడించారు. గ‌తం తాలుకూ అనుభ‌వాల నుంచైనా పాఠాలు నేర్చుకోని బాబు.. తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి ఉదంతంలో అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తూ.. దాడి చేసిన నిందితుడు జ‌గ‌న్ వీరాభిమాని అంటూ ప్ర‌చారానికి తెర తీశారు. ఈసారి ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి గ‌త అనుభ‌వం మ‌రోసారి రిపీట్ కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News