విజన్ 2019.. కలెక్టర్ల మీటింగులోనూ చంద్రబాబు ఎలక్షన్ ప్లాన్

Update: 2017-09-20 23:30 GMT
కొత్త రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, నిలదొక్కుకునేలా చేసేందుకు ఎన్నో యాక్షన్ ప్లాన్లు చెప్పిన సీఎం చంద్రబాబు మూడేళ్లలోనే అవన్నీ మరిచి ఇప్పుడు ఎలక్షన్ ప్లాన్లలో మునిగితేలుతున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మళ్లీ తాను సీఎం కావడమే లక్ష్యంగా ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  2019 ఎన్నిక‌లకు ఇంకా 20 నెల‌ల టైమ్ ఉన్న తరుణంలో రాష్ర్టాభివృద్ధి లక్ష్యం కంటే పార్టీ ప్రగతే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తుండడంతో అధికారుల నుంచి కూడా తీవ్ర అంసతృప్తి వ్యక్తమవుతోంది. చివరకు కలెక్టర్ల సమావేశాల్లోనూ చంద్రబాబు ఎన్నికల గురించే మాట్లాడుతుండడంతో అధికారులంతా నిశ్చేష్టులవుతున్నారు.

    స‌చివాల‌యంలో సమీక్ష సమావేశాలైనా, క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ అయినా చంద్రబాబు తాను ప్రభుత్వాధినేతనన్న విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ అధినేతగానే వ్యవహరిస్తున్నారంటూ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం గెల‌వడానికి... అందుకోసం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు ఏం చేయాలన్న కోణంలోనే సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారంటున్నారు అధికారులు. దీంతో ప్రభుత్వ స‌మావేశాల తీరును చూసిన వారు చంద్ర‌బాబుకి 2019 ఫోబియా ప‌ట్టుకుందంటున్నారు.

    ఇటీవల నిర్వహించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశాల్లోనూ సీఎంది ఇదే తీరు. రాష్ట్ర ఆర్థిక‌ప‌రిస్థితి బాగాలేదు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు కోసం ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ఏదైనా చెప్తారని భావించిన కలెక్టర్లకు అక్కడ చంద్రబాబు చెప్పిన మాటలు షాక్ కు గురిచేశాయట. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, ప్రగతి పథకాలపై నిర్వహించిన సర్వేలో 58 శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, 42 శాతం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారట. రాష్ర్టంలో పేదల కష్టసుఖాల గురించి మాట్లాడకుండా కాల్‌సెంట‌ర్ లెక్కలు చూపిస్తుండడంతో ఇదేమి గొడవో అని వారు విసుక్కుంటున్నారు
Tags:    

Similar News