టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన కాన్వాయ్ దండుమల్కాపురం వద్ద ప్రమాదానికి గురైంది. చంద్రబాబు కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనానికి ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది.ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కాగా ప్రతి శనివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటున్నారు.