ఒకవైపు ఆంధ్రోళ్లెవరూ తెలంగాణలో ఉండటానికి వీల్లేదని ధర్నాలు చేస్తూ విద్యుత్ ఉద్యోగులను పీకేశారు. వారికి అందరూ మద్దతు పలికారు. మరో వైపు ఏపీ అంటే అరికాల మంట లేచే తెలంగాణ ఉద్యోగులు కూడా, రాష్ట్ర విభజనలో పాల్గొన్న వారు ఏపీకి రావడానికి సిద్ధమై చేరిపోయారు. ఏపీలో ఉద్యోగుల పదవీ కాలం 58 నుంచి 60కి పెంచడంతో తెలంగాణ ఉద్యోగులకు వరంగా పరిణమించింది. తెలంగాణలో పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నవారు ఆప్షన్ల పేరుతో ఇటుగా వచ్చి ఏపీ కొలువుల్లో కుదురుకుంటున్నారు. తరువాత పదోన్నతుల ఫైల్ ను నెమ్మదిగా కదిపి, ఏపీ ఉద్యోగులకు అడ్డంకిగా మారుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఏపీ ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు.
వాస్తవానికి ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్ నాథన్ కమిటీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడంతో.. దానినే అవకాశంగా మలచుకుంటున్నారు. ఇది ఇంతకాలం జనరల్ గా మాత్రమే ప్రస్తావనలోకి వచ్చింది. తాజాగా సమాచారశాఖ ఉద్యోగులు ఈ ఆవేదనను బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ శాఖలో నలుగురు తెలంగాణ ఉద్యోగులు వచ్చిచేరారు. ఇపుడు తదుపరి ప్రమోషన్లు వీరికి దక్కనున్నాయి. అంటే తమ ప్రమోషన్లు కొట్టేయడమే బాధాకరమంటే... తమను గెంటేసిన వారికి అవి దక్కడం ఇంకా బాధాకరంగా ఉందని వారు వాపోతున్నారు. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో ఏపీ ఉద్యోగ సంఘాలకు సైతం పాలుపోవడం లేదు.