మందస్తు ఎన్నికల నేపథ్యంలో సొంతంగా పోటీ చేసే అంత సత్తా లేక - రాజకీయంగా ఆగర్భ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి మరీ బరిలో దిగుతోన్న తెలుగుదేశం పార్టీ ఈ క్రమంలో తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు దృష్టి సారించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో...ఎలా వ్యవహరించాలన్న దానిపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయ్యారు.
ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో...వీలైనంత త్వరగా స్థానాల సంఖ్య తేల్చుకోవాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాలతో పాటు ఖమ్మం - నిజామాబాద్ - మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. సీట్ల ఖరారుతో పాటు పొత్తుల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ సమావేశం సందర్భంగా పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. కూకట్ పల్లి నుంచి పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి - ఖైరతాబాద్ - బి ఎన్ రెడ్డి - శేరిలింగంపల్లి నుంచి భవ్య సిమెంట్ అధినేత ఆనంద్ ప్రసాద్ పేర్లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన టీడీపీ వెలువరించలేదు.