ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మనసులను గెలుచుకునే క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలవుతోంది. 80%కి పైగా ప్రజాదరణ పొందాలని ఇప్పటికే పార్టీ నేతలకు ఆర్డర్ పాస్ చేసేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు సైతం అలాంటి సలహాతో కూడిన ఆర్డర్ వేశారని అంటున్నారు. అయితే ఇంతకు బాబు ఆర్డర్ వేశారా లేక వారి మద్దతును అభ్యర్థించారా అనేది అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. తనదైన శైలిలో పదేపదే చెప్పడం చూస్తే సందేహం కలుగుతుందని అన్నారు.
కృష్ణా జిల్లా రెడ్డిగూడ మండలం ముద్దలపర్వలోని చింతలపూడి ఫేజ్-2కు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది కోసం ప్రజలందరూ నాకు సహకరించాలని అన్నారు. నూటికి 80 శాతం మంది సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకే తమకు సహకరించాలని, అండగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కులాలు - మతాలు - ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా తమకే ప్రజలు మద్దతుగా నిలవాలని బాబు పునరుద్ఘాటించారు. ``అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉంది. ప్రజల కష్టాలను నేను అండగా ఉంటాను. మొండి ధైర్యం శ్రమతోనే ఎన్ని కష్టాలున్నా ముందుకు సాగుతున్నాను.అందుకే మీరు అండగా ఉండాలి`` అని బాబు ప్రస్తావించారు.
చింతలపూడి ఎత్తిపోతలతో 9 నియోజకవర్గాలకు సాగునీరందిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. 2లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు స్థిరీకరిస్తామన్నారు. ఏడాదిన్నరలో నీరు పారాలని కాంట్రాక్టర్లను ఆదేశిస్తున్నామని తెలిపారు. రైతులకు మనకంటే బాగా రుణమాఫీ చేశారా అని సవాల్ విసురుతున్నానన్నారు. ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అని, సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నామన్నారు.ప్రకృతిని ఆరాధించడానికి మనం సమాయత్తం కావాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మనమంతా ప్రకృతిలో భాగం అని అందుకే గోదావరికి నిత్య హారతినిస్తున్నామన్నారు. జలసిరికి హారతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశఃతో ‘జలసిరికి హారతి’ కార్యక్రమానికి పిలుపునిచ్చానని అన్నారు. కృష్ణా - పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రూ.3,208 కోట్లతో చేపడుతున్న రెండో దశ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇసుక దందాలు చేస్తే ఖబడ్దార్ అని సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు.