ఏపీ కష్టాలు, కేంద్ర ప్రభుత్వ సహాయం - తమ ప్రయత్నంపై మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఎప్పట్లాగే విభజనపై తప్పుపట్టారు. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని నిందించారు. తమ ప్రయత్నాన్ని ఏకరువు పెట్టారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హేతుబద్ధత లేకుండా జరిగిందని తాను మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. విభజన తరువాత కట్టుబట్టలతో నెత్తిన పెద్ద మొత్తం అప్పుతో మనం అమరావతికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించిన చంద్రబాబు బీజేపీ న్యాయం చేస్తుందనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. 30 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఇంత వరకూ కేవలం 10 వేల రూపాయలు మాత్రమే పరిష్కరించారని చంద్రబాబు చెప్పారు. ఏకపక్షంగా విభజన చేసిన కాంగ్రెస్ ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో నాడు పట్టుపట్టినది నాటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు అని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పిన బీజేపీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి అన్నారు. ఇప్పటి వరకూ అదీ లేదన్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు - హిమాలయన్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నామన్నారు. నాడు ప్రత్యేక హోదా ఇవ్వలేమనీ, 14వ ఆర్థిక సంఘం నివేదిక తరువాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కొనసాగించలేమని చెబితేనే హోదాకు సమానమైన ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు అంగీకరించామని చంద్రబాబు అన్నారు.
ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతున్నారని అయితే ఆ పేరు లేకుండానే 11 రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని అయితే ఆ రూపంలో కూడా ఏపీకి సాయం చేయలేదని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాపై రాజీ పడ్డానని అనడం సరికాదని స్పష్టం చేశారు. ఎక్కడా ఎప్పుడూ రాజీపడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభకు వచ్చినప్పుడు రాజ్యసభలో బిల్లు ఆమోదింపచేసుకునేందుకు బీజేపీ పట్టుపడితే విధిలేని పరిస్థితులలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని, రాష్ట్ర పునర్విభజన బిల్లు పార్లమెంటు అమోదం పొంది చట్ట రూపం తీసుకుందని చంద్రబాబు అన్నారు. చట్టాన్ని అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలాగే విభజన చట్టంలో చాలా ప్రొవిజన్స్ పెట్టారని చంద్రబాబు చెప్పారు. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మనం పడిన కష్టం సత్ఫలితాలను ఇస్తున్నదని చంద్రబాబు చెప్పారు. అందుకు మీరు అభివృద్ధి చెందుతున్నారు కనుక మీకింక సాయం ఎందుకు అన్న విధంగా వ్యవహరించడం సరికాదని చంద్రబాబు అన్నారు.
విభజన తరువాత రాజధాని కూడా లేకుండా మిగిలిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతో కష్టపడ్డామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని తొలి రోజుల్లో బస్సే తన పరిపాలన కేంద్రమని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ణతలు చెబుతున్నానన్నారు. విభజన కష్టాలు వెన్నాడుతున్నా…కసిగా పని చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వృద్ధి విషయంలో మనం ముందున్నామన్నారు. ఇందుకు వ్యవసాయ కూలి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని, కసితో పని చేశారని చంద్రబాబు చెప్పారు. నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం పెట్టుకుని ఎక్కడికక్కడ స్ఫూర్తి నింపుకుంటూ ముందుకుపోయామన్నారు. అయితే ఇంత కష్టపడినా, ఇంత వృద్ధి వచ్చినా తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలలో పోలిస్తే వెనుకబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఇందుకు విభజనలో జరిగిన అన్యాయమని చంద్రబాబు అన్నారు. విభజన వల్ల ఒనగూరుతున్న నష్టాలపై ఏడు శ్వేత పత్రాలను ఇచ్చామని అన్నారు. విభజన వల్ల సంక్షోభంలో ఏర్పడిన రాష్ట్రాన్ని ఈ మూడున్నరేళ్లలో చేసిన కృషి, ప్రజల సహకారం కారణంగా ముందుకు పోగలిగామని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా తన ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించనంత మాత్రాన ఏపీ అభివృద్ధి ఆగదని చంద్రబాబు అన్నారు. విభజన వల్ల నష్టపోయాం…ఆ నష్టం పూడేంత వరకూ కేంద్రం సహకరించాలి. కేంద్రం సహకరించకున్నా అనేక విషయాల్లో పురోభివృద్ధి సాధించామని, అయితే అభివృద్ధి చెందిన మీకు కేంద్రం సహకారం ఎందుకు అని కొందరు అంటున్నారని అది సరికాదని చంద్రబాబు అన్నారు. తాను కేంద్రాన్ని విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ప్రత్యేక హోదా వేరే వారికి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని అడుగున్నామని అన్నారు. పారిశ్రామిక రాయతీలు ఇతరులకు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నానని చంద్రబాబు చెప్పారు. మీరు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కనుక మీకు సహాయం చేయడం లేదని అనడం దారుణమని చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికలకు ముందు మీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. నాలుగేళ్లు వేచి చూశామన్నారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీకి రిక్తహస్తం చూపిన తరువాతనే తాను గొంతెత్తి మాట్లాడుతున్నానని చంద్రబాబు అన్నారు. అంతకు ముందు 29 సార్లు హస్తిన వెళ్లి రాష్ట్రానికి సహకారం అందించాలని, విభజన హామీలు అమలు చేయమని విజ్ణప్తి చేశానని చెప్పారు. మన రాష్ట్రంలో విపక్షం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర సమస్యల గురించి సమష్టిగా పోరాడాల్సిన సమయంలో కూడా వారు అసెంబ్లీకి రారు, అన్ని విషయాల్లోనూ విపక్షానికి ద్వంద్వ వైఖరేనని విమర్శించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆత్మ విశ్వాసం ఎంత ముఖ్యమో, ఆత్మ విశ్వాసం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.
పించన్లను లోటు బడ్జెట్ లో చేర్చామని కేంద్రం చెబుతున్న మాటలను చంద్రబాబు కొట్టిపారేశారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకుని పింఛన్లు ఇచ్చామని దేశంలో ఎక్కడా లేని విధంగా 55లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. మొన్న గవర్నర్ ఆర్టీజీని సందర్శించినప్పుడు అప్పటికే 75 శాతం మంది పిఛన్లు డ్రా చేసుకున్నారని ఆయన ఆశ్చర్య పోయారనీ - నాలుగు రోజులలో 75శాతం మంది పింఛన్లు అందుకున్నారంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎంత శ్రద్ధగా - ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నదో అర్ధమౌతుందని చంద్రబాబు చెప్పారు.