ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అసహనం తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో గంటాపై బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యాశాఖకు సంబంధించిన కాగితాలను విసిరివేసి మరీ సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది.
మంత్రిమండలి సమావేశంలో ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నివేదికలు సదరు మంత్రులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించిన నివేదికను గంటా శ్రీనివాసరావు అందజేయగా వాటిని ముఖ్యమంత్రి విసిరేసినట్లు సమాచారం. 'కాగితాలపై కాదు..ఆచరణలో చూపండి' అంటూ ఆయన గంటాపై విరుచుకుపడ్డారని చెబుతున్నారు. వాస్తవానికి గత నాలుగు నెలల నుంచి గంటాపై ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా విద్యాశాఖను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆ శాఖ నుంచి వచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంజేషన్ ను కూడా ఆయన నిలిపివేశారు. ఇటీవల జరిగిన ఐఎఎస్ బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఆర్ పి సిసోడియాను తప్పించడానికి కూడా ఇదే కారణమని సమాచారం. ఇటీవల జరిగిన బిఇడి కళశాల అడ్మిషన్ల విషయంలో కూడా గంటాపై ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ఎడ్ సెట్ లో ఉత్తీర్ణులయిన వారికి కాకుండా, ఇష్టానుసారం అడ్మిషన్లు జరిగాయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీంతో వీటన్నింటికీ దృష్టిలో ఉంచుకొని గంటాపై బాబు సీరియస్ అయినట్లు సమాచారం.