ప్రజాసంక్షేమాన్ని విస్మరించినా...ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేసిన పాత చంద్రబాబును చూస్తారంటూ కొద్దిరోజుల క్రితం హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తాజాగా ఆగ్రహ రూపం దాల్చారు. ప్రజా సంక్షేమ రిత్యా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ సొమ్మును ఖర్చుచేయడంపై ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారులే గీతదాటడంపై బాబు ఫైరయ్యారు.
12 కోట్ల రూపాయలు వెచ్చించి తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సీఎం చంద్రబాబు తాజాగా ఇతర ఖర్చులపై దృష్టిపెట్టారు. ఈక్రమంలో విస్మయకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిపి కేవలం రవాణా, బసకు కలిపి 50 కోట్లు ఖర్చు చేశారని లెక్కలు తేలాయి. దీంతో సీనియర్ అధికారుల వ్యవహార సరళిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అత్యంత ఖరీదైన ప్రయాణాలు చేయడం - విమానాల్లో డీలక్స్ టిక్కెట్లు - ఖరీదైన కార్లలో ప్రయాణం ప్రభుత్వ మెడలను విరుస్తోందని బాబు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. సివిల్ సర్వీసు అధికారులు - మంత్రులు - శాసనసభ్యుల రవాణా - బస చార్జీలు రోజురోజుకూ తడిసిమోపెడు కావడం ఏంటని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారులు ‘లగ్జరీ’ విడనాడాలని ఆరు నెలల క్రితమే చంద్రబాబు సూచించారు. స్టార్ హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ విడిది గృహాల్లోనే ఉండాలని తెలిపారు. అందుకు అవసరమైన రీతిలో అతిథి గృహాలకు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలను అధికారులు గాలికి వదిలేశారు. ఆఖరి నిమిషంలో పర్యటనలు - విదేశీ పర్యటనలు - శిక్షణ - పర్యవేక్షణ - పరిశీలన పర్యటనలు చేస్తూ ఐఎఎస్ - ఐపీఎస్ అధికారులు చేసిన టూర్లు ఆర్థిక శాఖకు తలకు మించిన భారంగా తయారైంది. దీంతో బిల్లుల ఆమోదంపై ఆంక్షలు విధించాలని, బిల్లులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే వాటిని ఆమోదించాలని సీఎం ఆదేశించారు. అయితే అప్పటికే వ్యవహారం చేయిదాటింది. దీంతో ఇందుకు సంబంధించి తాజాగా సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.