రాష్ర్ట విభజన తర్వాత విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు వెలగపూడిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఇక జూన్ 27కు ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందేనని ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టంచేసింది. కానీ రాజధాని పరిధిలో ముఖ్యంగా విజయవాడ - వెలగపూడిలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని సాకుగా చెబుతూ తప్పించుకుంటున్నారు. అయితే నిజంగానే అద్దెలు ఇంతలా ఉన్నాయా? లేక ఉద్యోగులు వెలగపూడికి వెళ్లకుండా కొంతమంది వేసిన దీనిని అడ్డుగా వేస్తున్నారా? అంటే రెండోదే కరెక్ట్ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
బందరు రోడ్డులో చదరపు అడుగు వంద రూపాయల పైన అద్దె ఉందంటూ అసత్యాలతో కూడిన నివేదిక ఇచ్చిన ఐఏఎస్ ల కమిటీ పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజధాని అమరావతికి తరలిరాకుండా కొంత మంది ఐఏఎస్ లు అడ్డుకోవటంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను సైతం క్షేత్రస్థాయికి వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబు చెవిలో వేశారు. వెంటనే ఆయన స్పందిస్తూ ఆ ఐఏఎస్ లు ఎవరో కూడా తనకు తెలుసనీ... ఏమి చేయాలో కూడా తనకు అవగాహన ఉందని చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
`నేను ఇప్పటి వరకు కార్డియల్ రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తే బాగుంటుందని చూశాను. కానీ కొంత మంది నా సానుకూలతను అసమర్ధతగా చూస్తున్నారు. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది, చంద్రబాబు ఎలా ఉంటారో` అంటూ కొంత మంది నేతల వద్ద కూడా వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ల బదిలీలు రెండవ దశ కూడా ఉండటంతో ఉద్యోగుల తరలింపునకు మోకాలు అడ్డుతున్న ఐఏఎస్ లకు తగిన స్ధానం చూపిస్తారని సి.ఎం.ఓ వర్గాలు భావిస్తున్నాయి.