చంద్రబాబు నోట బాలకృష్ణ డైలాగులు

Update: 2015-03-17 09:38 GMT
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం శాసనసభలో అందరి దృష్టినీ ఆకర్షించారు. బావమరిది బాలకృష్ణ సినిమాలో డైలాగులు మాదిరిగా మాట వెనుక మాటా గ్యాప్‌ లేకుండా తూటాల్లా పేల్చి విపక్షం వైసీపీని, ఆ పార్టీ నేత జగన్‌ను వణికించారు. ఎంత కోపమున్నా కొంత కంట్రోల్‌లోనే ఉంటూ మందలించినట్లు మాత్రమే మాట్లాడే చంద్రబాబు ఈసారి మండిపడడమంటే ఏంటో శాసనసభ సాక్షిగా అందరికీ చూపించారు. అంతేకాదు సభానాయకుడిగా నాకు అన్ని హక్కులూ ఉన్నాయి అంటూ మితిమీరిన దర్పం ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన అనర్గళంగా డైలాగులు చెబుతుంటే అంతా నోరెళ్లబెట్టారు. బావమరిది బాలకృష్ణ దగ్గర ట్రైనింగు తీసుకొన్నారా ఏంటని గుసగులాడుకున్నారట.

    అసెంబ్లీలో చంద్రబాబు ఫైరింగ్‌కు ఆ పార్టీ నేతలు ముచ్చటపడిపోతున్నారు. తమ అధినేత ఇలా దూకుడు చూపితే తాము కూడా ఇక రెచ్చిపోతామంటూ సిద్ధమవుతున్నారు.

జగన్‌పై చంద్రబాబు మాటల తూటాలివీ..

- ఏయ్‌.... ఎగిరెగిరి పడొద్దు... ఇది హౌజ్‌.. మీ ఊరు కాదు

- డౌన్‌ డౌన్‌ అంట... నన్ను డౌన్‌డౌన్‌ అంటారా... నన్ను డౌన్‌డౌన్‌ అనే అర్హత మీకు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడొద్దు.. సిగ్గులేని మనుషులు మీరు

- యాజ్‌ ఏ లీడర్‌ ఆఫ్‌ ది హౌజ్‌.. ఐ యామ్‌ హేవింగ్‌ ఎవ్రీ రైట్‌

- రౌడీయిజం ఎవరూ చేయలేరు ఇక్కడ. మీ తండ్రివల్లే కాలేదు.. నువ్వెంత?

- పిచ్చిపట్టింది నీకు.. నువ్వెంత

- ఇది సభ్యత కాదు.. సభ్యత ఉన్నవారైతే కూర్చోవాలి. అధ్యక్షా... వీళ్లంతా సభ్యత లేని మనుషులు... వీళ్ల కథ తేలుస్తాను.. వదిలిపెట్టను మిమ్మల్ని.

- పిచ్చి ఆటలు ఆపండి... పోయి కూర్చోండి.. తమాషాలు చేయొద్దు

- మీ పద్ధతి ఏం బాగులేదు.. శక్తి చాలనప్పుడే ఇలా చేస్తారు. మీ ఇష్టప్రకారం చేస్తామంటే కుదరదు.

Tags:    

Similar News