ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణతోనే తాజా క్యాబినెట్ మీటింగ్ సాగిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. విపక్ష నేతకు అందే సమాచారం.. అధికారంలో ఉండి కూడా తనకు అందకపోవటంపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చాపరాయిలో విష జ్వరాల కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటంపై బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి.. తనకు ఎలాంటి సమాచారం అందకపోవటం.. అదే సమయంలో విపక్ష నేత జగన్ ఏకంగా.. బాధితుల్ని కలిసి వారిని సాంత్వన కలిగేలా చేయటంపై బాబు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
తనకు సమాచారమే తెలీని సమయంలో.. జగన్ మాత్రం ఏకంగా బాధిత ప్రదేశాల్లో పర్యటించటంపై తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో అధికారుల్ని నిలదీసినట్లుగా తెలుస్తోంది. మరణాలపై తనకు ఎందుకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. విషజ్వరాలు ప్రబలుతున్న చోట చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు సీరియస్ అయినట్లుగా సమాచారం.
మంత్రులకు తెలిసిన విషయాలే ఇప్పుడు చెబుతున్నారని.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. చాపరాయి సమాచారం ముందుగా మనకు ఎందుకు రాలేదని ఆయన నిలదీసినట్లుగా తెలుస్తోంది. అధికారుల్లో ఉదాశీనత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని.. కింద నుంచి పై స్థాయి వరకూ ఇదే పరిస్థితి ఉందన్న అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
సమాచారం ఎందుకు రాలేదు? సమాచారం వచ్చిన తర్వాత కూడా ఎందుకు కదలలేకపోయారు? ఇంతలా ఉదాశీనత? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన బాబు.. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సస్పెండ్ చేసేవాడినని.. కానీ అందరితో ఓపిగ్గా పని చేయించుకోవాలని అనుకుంటున్నానని అందుకే ఏమీ చర్యలు తీసుకోవటం లేదని చెప్పినట్లుగా చెబుతున్నారు. బాబు సమీక్ష జరిపే సమయంలో ఉన్నతాధికారి ఒకరు కలుగజేసుకొని విష జ్వరాలు మామూలేనని.. చాలా తేలిగ్గా చెప్పినట్లుగా సమాచారం.
దీంతో.. బాబు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రతి గ్రామంలో ఏఎన్ఎం.. ఆశా వర్కర్.. కమ్యూనిటీ ఉద్యోగి వంటి వారు ఉన్నారని.. వారికి సెల్ ఫోన్లు కూడా ఇచ్చామని అయినా సమాచారం అందకపోవటం ఏమిటంటూ నిలదీసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అధికారం చేతిలో ఉండి కూడా కీలకమైన సమాచారం అందకపోవటం ఏమిటన్నది బాబు సందేహంగా మారింది. అదే సమయంలో విపక్ష నేతకు సమాచారం అందటంపైనా ఆయన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/