సుజనా ‘పంది’ మాటలకు బాబు క్లాస్

Update: 2017-01-27 09:57 GMT
ఒక్కమాట..ఒకే ఒక్క మాట చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇక.. ప్రముఖుల నోటి నుంచి వచ్చే కొన్ని అనవసరమైన వ్యాఖ్యల కారణంగా జరిగే నష్టం భారీగా ఉంటుంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి నిన్న చేసిన ‘పంది’వ్యాఖ్యలు ఇదే తరహాలోనివని చెప్పాలి. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని విశాఖలో తల పెట్టిన శాంతి నిరసన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. జల్లికట్టు స్ఫూర్తి అంటే.. కోడి పందాలో.. పంది పందాలో ఆడుకోవాలే కానీ.. ఇదేంటి? ఏపీకిప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అంటూ మాటలతో తెగబడ్డారు.

సుజనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటమే కాదు.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజింగ్ గా మారాయి. సుజనా చేసిన వ్యాఖ్యల్ని వార్తా ఛానళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో పాటు.. సోషల్ మీడియాలో భారీగానే చర్చ సాగింది. సుజనా చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదలు చాలామంది నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సుజనా వ్యాఖ్యలు చూస్తే.. ఏపీ సర్కారుకు డ్యామేజ్ చేసేవిలా ఉన్నాయని.. అధికారం తలకు బాగానే పట్టేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందన్న వాదనలు వినిపించాయి.ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. సుజనాకు తలంటు పోసిన ఆయన.. ప్రజాజీవితంలో ఉన్న వారు ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అంటూ క్లాస్ పీకినట్లుగా సమాచారం.

అధికారంలో ఉన్నవారు ఆచితూచి వ్యాఖ్యలు చేయాలని.. విపక్షాలు ఎలా మాట్లాడిన నడుస్తుంది కానీ.. అధికారపక్ష నేతలు జాగ్రత్తగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సుజనా వ్యాఖ్యపై పెద్దఎత్తున విమర్శలు రేగుతున్న వేళ.. ఆయన్ను బాబు క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చేలా చేయటంలో ఏపీ సర్కారు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అధినేతే స్వయంగా తిట్టేసిన తర్వాత.. ఇష్యూ అక్కడితో క్లోజ్ అయినట్లేనన్న భావన కలుగజేసేందుకే.. క్లాస్ పీకారన్న అంశాన్ని బయటపెట్టినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News