ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తన మంత్రివర్గ సహచరులపై మండిపడ్డారు. అయితే సాధారణంగా జరిగే కేబినెట్ సమావేశాల్లో కాకుండా ఈ దఫా పార్టీ సమన్వయ సమావేశంలో మంత్రుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రులు ఏ ఒక్కరూ సరిగా పని చేయడంలేదంటూ మండిపడ్డారు. "బాధ్యతంతా నా ఒక్కడిదేనా.. మీరంతా అధికారాన్ననుభవించడం తప్ప బాధ్యతల్లో భాగస్తులు కారా? అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలకు సంబంధించిన ఆదేశాల్ని మీ సిబ్బంది కూడా సరిగా అమలు చేయడంలేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు. జిల్లాల పర్యటనలో అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. పార్టీ గురించి పట్టించుకోరా.. ఇటు ప్రభుత్వాన్ని నడిపి, అటు పార్టీ నిర్వహణను భుజానకెత్తుకోవాలా.. ఇలా ఎంత కాలం? ఇన్నాళ్ళు నేను పరిగెట్టాను.. ఇక అందర్నీ పరిగెట్టిస్తాను.. పరిగెట్టి తీరాల్సిందే.. పరిగెట్టలేని వారు ఆగిపోయి రెస్ట్ తీసుకోవడమే" అంటూ క్లాస్ తీసుకున్నారు.
పార్టీ నాయకులను కలుపు కెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో తానొక్కడినే గెలిస్తే సరిపోదని, మీ అందర్నీ గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని బాబు వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు ప్రజాప్రతిధుల్లా కాకుండా అధికారుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అధికారులైతే ఒక్కసారి ఉద్యోగంలో చేరితే పదవీ విరమణ వయస్సు వరకు ఎక్కడనో ఒకచోట ఉద్యోగం కొనసాగుతుంది. కానీ మనం అలాకాదు...ఐదేళ్ళ తర్వాత తిరిగి ప్రజల ముందుకెళ్ళాలి.. వారి ఓటును అభ్యర్ధించాలనేది గుర్తు ఉంచుకోండి" అంటూ వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ కార్య క్రమాల్లో పాల్గొనేందుకే మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తున్నారే తప్ప ఎవరైనా ఎక్కడైనా ఆ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా అంటూ చంద్రబాబు సూటిగా నిలదీశారు. జిల్లాల పర్యటనల సందర్భాల్లో ఖచ్చితంగా మంత్రులు పార్టీ కార్యాలయాలకు వెళ్ళాలన్న ఆదేశాలున్నాయని, అయితే ఎంతమంది వెళ్తున్నారంటూ బాబు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎన్నికల విషయంలోనూ పార్టీ నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు. ఒక్క శాసనసభ ఎన్నికలే కాదు..ఐదేళ్ళలో జరిగే అన్ని ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావించాల్సిందేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టకు విశ్వాసంగా నిలుస్తాయన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజల్ని పదే పదే కలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఏ ఎన్నికను తక్కువగా చూడకూడదని, గ్రాడ్యుయేట్, టీచర్, అలాగే కార్మిక సంఘాల ఎన్నికల్ని తెలుగుదేశం పట్టించుకోదన్న భావన వీడాలని సూచించారు. స్థానిక ఎన్నికల్ని పట్టించుకోకుండా పదవులు, టికెట్లు కావాలంటే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. త్వరలో వచ్చే ఎన్నికలను సైతం కీలకంగా తీసుకోవాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/