దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి భిన్నం. ఆయనకు పబ్లిసిటీ మీద ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతిసారీ పబ్లిసిటీ మీద భారీగా ఫోకస్ చేసే ఆయన తీరు ఇప్పుడు ఆర్టీసీ ప్రాణం మీదకు తెచ్చిందని చెబుతున్నారు.
బాబుకు పబ్లిసిటీ మీద ఎంత ఆసక్తి అంటే.. తుఫాన్ల సందర్భంగా ప్రజల ప్రాణాలకు.. ఆస్తులకు రక్షణ కల్పించే అంశం మీద దృష్టి పెడతారు కానీ..అదృష్టవశాత్తు పెద్ద నష్టాన్ని కలిగించకుండా తుపాను వెళ్లిపోతే.. తుపాన్లను జయించామంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేసుకునే తీరు బాబుకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
కేంద్రం నిధులతో భారీ ఎత్తున నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మీద ప్రచారం చేసుకునేందుకు ఆయన అనుసరించిన విధానం ఆర్టీసీని అప్పులు పాలయ్యేలా చేయటమే కాదు.. ఆ సంస్థ మీద విపరీతమైన ఆర్థిక భారం మోపేలా చేసిందని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారు ఎంతలా పని చేసిందో చెప్పేందుకు వీలుగా.. పోలవరం విహార యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా.. అన్ని గ్రామాల నుంచి పోలవరం వరకు ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టు చూసి వచ్చేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన బాబు నిర్ణయం కారణంగా రూ.65 కోట్ల ఖర్చు వచ్చి పడింది. ఈ మొత్తాన్ని బకాయిల రూపంలో ఆర్టీసీమీద ఉండటంతో.. ఆ సంస్థ ఇప్పుడు కిందా మీదా పడుతోంది. ఓపక్క పేద రాష్ట్రం.. బక్క రాష్ట్రం.. విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రమని మాటలు చెప్పే బాబు.. ఇంత భారీ ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకు భిన్నంగా ఆయన చేసిన ఖర్చుతో ఆర్టీసీ ఇప్పుడు కుయ్యో.. మొర్రో అంటోంది. బాబు పబ్లిసిటీ పిచ్చ ఏమో కానీ.. ఆర్టీసీ ప్రాణం మీదకు వచ్చిందన్న మాట పలువురి అధికారుల నోటి నుంచి రావటం గమనార్హం.