తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ల మధ్య మరో వివాదం తెరమీదకు వచ్చింది. సమసిపోయింది అనుకున్న హైకోర్టు విభజనను ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ కెలికారంటూ...అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారని తెలంగాణ భగ్గుమంటోంది. ఏపీ హైకోర్టు ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరో తిరకాసు పెట్టారని తెలంగాణ న్యాయవాదులు - ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. అమరావతిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లోనే తాత్కాలికంగా ఏపీ హైకోర్టును ఈ ఏడాది జూన్ నాటికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారు. పునాది కూడా వేయని భవనాన్ని ఎనిమిది నెలల్లో పూర్తిచేసిన తర్వాత తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తామంటూ సోమవారం చంద్రబాబు ప్రకటించారు. తాత్కాలికంగా హైకోర్టును ఏర్పాటు చేసేందుకు తాము ఎంపిక చేసిన భవనాలను పరిశీలించి నిర్ణయం చెప్తే నాలుగునెలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి (ఏసీజే) లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ సర్కారు ఫైర్ అవుతోంది.
ఈ ఏడాది జూన్ నాటికి ఏపీకి ప్రత్యేక హైకోర్టును అమరావతిలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉమ్మడి హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ కు గత ఏడాది డిసెంబర్ చివరివారంలో ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తాము ఎంపిక చేసిన భవనాలను పరిశీలించి నిర్ణయం చెబితే - హైకోర్టుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కేవలం నాలుగునెలల్లో కల్పిస్తామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్లనే న్యాయమూర్తుల కమిటీ ఏపీ సర్కారు చూపించిన భవనాలను పరిశీలించి వచ్చింది. విభజన తెలంగాణ పట్టుబట్టడంతో చంద్రబాబు లేఖ ఆధారంగా అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకోసం కావలసిన భవనాలను పరిశీలించేందుకు ఏసీజే నియమించిన ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ అక్కడికి వెళ్లింది. రెండ్రోజులపాటు భవనాలను పరిశీలించింది. కమిటీ నివేదిక రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు మాటమార్చడం గమనార్హం. శాశ్వత భవనం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా మరో కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని న్యాయనిపుణలు పేర్కొంటున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు మొదటినుంచి చంద్రబాబు విముఖంగా ఉన్నారనడానికి ఈ కుంటిసాకులు - రోజుకో మాట మాట్లాడటం నిదర్శనమని అంటున్నారు. పునాదులు కూడా వేయని భారీ భవనాన్ని ఎనిమిదినెలల్లో నిర్మించి హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పడం మభ్యపెట్టడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆచరణలో సాధ్యంకాని మాటలతో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును సాగదీస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కమిటీ తన అభిప్రాయం చెప్పకముందే.. తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయని తెలంగాణ వర్గాలు అంటున్నాయి. సాక్షాత్తు ప్రధానన్యాయమూర్తికి రాసిన లేఖలోని అంశాలను పక్కనపెట్టి - అందుకు భిన్నంగా బాబు ప్రకటన చేసినట్టు అర్థమవుతున్నది. ఇది న్యాయస్థానాలను - న్యాయమూర్తులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలంగాణ న్యాయవాదులు మండిపడుతున్నారు. న్యాయమూర్తుల కమిటీ తన నివేదికను సమర్పించక ముందే తాత్కాలిక హైకోర్టు కోసం కొత్తగా మరో భవనాన్ని త్వరలో ప్రారంభించి ఎనిమిదినెలల్లో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చెప్పడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇదంతా భవనాల పరిశీలన జరిపిన కమిటీలోని న్యాయమూర్తులను గందరగోళానికి - అయోమయానికి గురిచేయడమేనని న్యాయవాదులు అంటున్నారు. సొంత హైకోర్టు ఏర్పాటును వీలైనంత కాలం సాగదీయడమే దీనివెనుక గల ఉద్దేశమని వారు మండిపడుతున్నారు. ఒకవేళ న్యాయమూర్తుల కమిటీ పరిశీలించిన భవనాల్లో ఏపీ హైకోర్టు నిర్వహించేందుకు ఉమ్మడి హైకోర్టు సంసిద్ధత వ్యక్తంచేస్తే మౌలికసదుపాయాలు కల్పించడానికి చంద్రబాబు విముఖత చూపుతారా? అని కొందరు నిలదీస్తున్నారు.
ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదుల డిమాండ్ మేరకు రాష్ట్ర ఏర్పాటు సమయం నుంచి అధికారపార్టీ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నది. ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు హైకోర్టు విభజన కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు ఆగ్రహంతో ఉన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు అడ్డంకులేమిటని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో టీఆర్ ఎస్ ఎంపీలు ఆందోళన చేపడుతున్న సమయంలోనే ఏసీజేకు చంద్రబాబునాయుడు లేఖ రాయడం, ఆ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రకటించడం జరిగాయి. సమావేశాలు ముగిసిన నేపథ్యంలో తిరిగి పాతపంథానే చంద్రబాబు- కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టు న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.