జగన్ కోరికను కాదన్న చంద్రబాబు ప్రభుత్వం

Update: 2017-09-27 00:55 GMT
ప్రతిపపక్ష నేత అంటే కేబినెట్ హోదా.. కానీ, ఏపీలో మాత్రం విపక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విషయంలో ప్రభుత్వం అస్సలు పట్టింపు లేకుండా వ్యవహరించింది. ప్రతిపక్ష నేత హోదాలో తాను విజయవాడలో ఉండేందుకు నివాసం కావాలని… అందుకోసం స్వరాజ్ మైదాన్ ఎదురుగుగా ఉన్న ఆర్‌ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌ను తనకు కేటాయించాలని జగన్‌ పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది.

    ప్రభుత్వానికి చాలా కాలం క్రితమే జగన్ ఈ విషయంలో లేఖ రాయగా చాలాకాలం తొక్కిపెట్టింది. ఏమనుకుందో ఏమో కానీ, ఇప్పుడు దానిపై స్పందిస్తూ నో చెప్పింది. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌ కేటాయించడం కుదరదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆ గెస్టు హౌస్‌లో మంత్రి అయ్యన్నపాత్రుడు తన  క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని... దానిని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం వీలుకాదని చెప్పింది.

    కాగా చాలాకాలంగా జగన్ హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆయన విజయవాడకు మారడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే స్వరాజ్ మైదాన్ ఎదురుగా మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథికి చెందిన స్థలంలో వైసీసీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అక్కడికి సమీపంలో ఉండే ఆర్‌ అండ్ బీ గెస్టు హౌస్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన దాన్ని కేటాయించాలని కోరగా ప్రభుత్వం మాత్రం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. 
Tags:    

Similar News