ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును దేశానికి ఆదర్శంగా చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని, ఇది నభూతో నభవిష్యతి అని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రికి తోడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి దేవినేని ఉమ కూడా చంకలు గుద్దుకుంటున్నారు. ప్రాజెక్టు నిధుల మంజూరు పై కేంద్రాన్ని చీటికీమాటికీ నిందిస్తున్న చంద్రబాబు మాటలకూ...... అదే నోటితో పోలవరం పనులు శభాష్ అంటూ చేస్తున్న వ్యాఖ్యాలకు పొంతన కుదురంటంలేదు. నిధులు లేకుండా, కేంద్రం నుంచి రాకుండా ఇక్కడ ఈ పనులు ఎలా జరుగుతాయంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో కేంద్రం నిధులు ఇవ్వకపోవడమైన నిజమై ఉండాలి, లేదా పనులు జరగకపోవడమైనా నిజమై ఉండాలి అంటున్నారు
.
ఈ రెండు అంశాలలోను ప్రచారం జరుగుతున్నంత వేగంగా పనులు జరగటంలేదని అక్కడికి వెళ్లి వచ్చిన వారు చెప్పుతున్నారు. పోలవరం పనులపై మాటల గారడీ తప్ప వాస్తవానికి ప్రాజెక్టు పనులు మందకొడిగానే జరుగుతున్నాయంటున్నారు. వంద కోట్ల రూపాయల పనులు జరిగితే వేయి కోట్ల రూపాయల పనులు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు వివిధ జిల్లాల నుంచి వారి మనుషులను - తెలుగుదేశం కార్యకర్తలను బస్సులలోను - రైళ్లలోను పోలవరానికి తరలిస్తున్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన వారు
పోలవరం పనులు అద్భుతం - మహాద్భుతం అంటూ పొగుడుతున్నారు. ఆ ప్రకటనలను పచ్చ " పత్రికలు - ఛానళ్లు ప్రధానంగా చూపుతున్నాయి. గోబెల్స్ ప్రచారంలో దిట్టయైన చంద్రబాబు నాయుడు పోలవరం పనులపై కూడా ఆ తరహా ప్రచారన్నే చేస్తున్నారు. పోలవరంలో అసలు పనులే జరగడం లేదన్నది ఎంత అవాస్తవమో... మహాద్భుతంగా జరగుతున్నాయన్నదీ అంతే అవాస్తవం. చారణా కోడికి బారణా మసాలా అన్న సామెత చంద్రబాబు పోలవరం పనులపై చేస్తున్న ప్రచారానికి సరిపోతుదంటున్నారు. రాజధాని రైతులకు క్యాపిటల్ బొమ్మలు చూపించి ఎలా ఆశలు కలిగిస్తున్నాడో - అచ్చం అలాగే రాష్ట్ర రైతులందరికీ పోలవరం బొమ్మలు చూపించే ఈ టెర్ము గట్టెక్కే పనిలో ఉన్నారు బాబు. అదేదో డైలాగన్నట్టు... విషయం తక్కువైనపుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందన్నమాట.
56 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికీ 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కానీ 70-80 శాతం పనులు అయిపోయాయి అని చెబుతున్నారు. ఇది ఏ విధంగా కరెక్టో అర్థం కాక జుట్టుపట్టుకునే పరిస్థితి ఉంది. అయినా జనాల మైండ్ బ్లాక్ చేయడం బాబు టీంకు మీడియాతో పెట్టిన విద్య. అధికారం చేపట్టినపుడు 2018లో పూర్తి చేస్తాను అని కాలం గడిచాక 2019 లోపు పూర్తి చేస్తాను అని అంటున్నారు. చిత్రం ఏంటంటే... బాబు పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి 2019లోపు పోలవరం పూర్తయ్యే ప్రసక్తే లేదు - అది అసాధ్యం అని కుండబద్ధలు కొట్టారు. అదండీ విషయం.