ఇద్దరు చంద్రుళ్లు సామాన్యులు కాదు. ఇద్దరూ ఇద్దరే. అలాంటి ఇద్దరు.. తెలుగమ్మాయి సిల్వర్ సింధు సత్కారం ఇష్యూను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సింధు సాధించిన ఒలింపిక్ విజయాన్ని సెలబ్రేట్ చేసే విషయంలో కొరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం. రజతం సాధించిన సమయంలో మొదటిగా స్పందించిన చంద్రబాబు రూ.3కోట్ల నగదు.. అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు.. గ్రూప్ 1 ఉద్యోగాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయినట్లు కనిపించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆమెకు అందరికంటే మిన్నగా రూ.5కోట్ల నగదును.. ప్రభుత్వ భూమిని ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. రెండు తెలుగు ప్రభుత్వాలు సింధు కోచ్ గోపీచంద్‌కు నజరానాలుప్రకటించాయి. నగదు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పోటీపడని చంద్రబాబు.. గోపీకి అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో 15 ఎకరాల భూమిని ప్రకటించారు. ఇదే కాక.. ఆంధ్రాయూనివర్సిటీ పీహెచ్‌డీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరికే కాక.. ఒలింపిక్స్ లో ఆడిన కిడాంబి శ్రీకాంత్.. తదితర క్రీడాకారుకలు నజరానాలు ప్రకటించారు. అన్నింటికి మించి భవిష్యత్తులో సింధుకు ఎలాంటి అవసరం వచ్చినా ఏపీ సర్కారు అండగా ఉంటుందన్న విషయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. సింధును ఏపీ సర్కారు దత్తత తీసుకుందన్న మాట తప్పించి.. ఆమెకు సంబంధించిన అన్ని అంశాల్ని తాము చూస్తామన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తనకున్న ప్రోటోకాల్ వదిలేసి మరీ.. తాను సింధుకు స్వాగతం పలికానని.. ఈ రోజు తాను చేసిన పనికి భవిష్యత్తులో ఎంతోమందికి స్ఫూర్తి కలగాలని తాను అనుకుంటున్న విషయాన్ని చంద్రబాబు చెప్పారు.
తన మాటలతో చంద్రబాబు ఒక్క విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. తనకు అహం ఉండదని.. నలుగురికి లాభం జరుగుతుందంటే తాను ఎంతకైనా తగ్గుతానని.. తాను ముఖ్యమంత్రి అన్న అహం లేదన్న విషయాన్ని చెప్పేయటంతో పాటు.. సింధుతో సరదాగా షెటిల్ ఆడేశారు. సింధుకు గ్రూప్ 1ఉద్యోగంతోపాటు.. పలువురు క్రీడాకారులకు గ్రూప్ 2 ఉద్యోగాల్ని ప్రకటించటం ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ కంటే తాను చాలా ముందున్నట్లుగా చెప్పేశారు.
పీవీ సిందును సత్కరించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కాస్త ఉత్తేజపూరితంగా మాట్లాడారు. బాబు మాట్లాడటానికి ముందు సింధు కోచ్ గోపీ మాట్లాడుతూ.. కరణం మల్లీశ్వరి ఒలింపిక్ పతకం సాధించిన సమయంలో చంద్రబాబు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారని.. అందులో తాను ప్రేక్షకుడిలా ఉన్నానని.. ఆ సందర్భంగా తానెంతోస్ఫూర్తి పొందినట్లుగా చెప్పారు. అదే తనను ఆల్ ఇంగ్లండ్ చాంఫియన్ షిప్ ను గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ మాటలు చంద్రబాబును మరింత ఉత్తేజితుల్ని చేసినట్లుగా ఉండటంతో ఆయన మరింత ఉత్సాహంగా మాట్లాడుతూ.. తానీ రోజు కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ఇచ్చి మరీ స్కూల్ పిల్లల్ని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చానని.. వారు స్ఫూర్తి పొందాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
అమరావతిలో ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించాలన్న తన తలంపును మరోసారి బయపటపెట్టారు. రియోలో చిన్న చిన్న దేశాలు పతకాలు సాధిస్తే మనకు ఒక్క పతకం రాలేదని.. సింధు ఆట ఆడుతున్న రోజున దేశమంతా పూజలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రియోలో సింధు మనకు ఆశాకిరణంగా కనిపించదన్నారు. సింధు విజయంలో కోచ్ గోపీతో పాటు.. వారి తల్లిదండ్రుల కృషి తో ఉందన్నారు. తానీ రోజున ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ రిసీవ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను క్రీడాకారుల్ని ఎంతగా ప్రోత్సహించిన విషయాన్ని వెల్లడించారు.
క్రికెట్టే కాదు అన్ని గేముల్ని ప్రోత్సహించాలని.. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒలింపిక్స ప్లేయర్లను తయారు చేయాలని.. మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే చైనా.. అమెరికా కంటే మంచిగా ఆడేవాళ్లు మన దగ్గరా ఉన్నారన్నారు. గోపీచంద్ తో తాను మాట్లాడానని.. అమరావతిలో 15 ఎకరాలు కేటాయిస్తున్నామని.. అవసరమైతే ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఇస్తామని.. ప్రపంచ శ్రేణి క్రీడా ఆకాడమీని సిద్ధం చేయాలన్నారు. విదేశాల నుంచి సైతం క్రీడాకారులు వచ్చి శిక్షణ పొందేలా ఆకాడమీ ఉండాలన్నారు.
హైదరాబాద్ ను ప్రపంచ పటం మీద పెట్టామని.. ఈ రోజు అమరావతి మీద దృష్టి పెట్టిన విషయాన్ని చెప్పిన చంద్రబాబు.. అమరావతిలో మార్పు వచ్చిందా? అని సభికుల్ని అడిగారు. వారు వచ్చిందంటూ చెప్పటం గమదవనార్హం. ఒలింపిక్స్ లో భారత పరువును సింధు కాపాడిందన్నారు. సింధు గోల్డ్ సాధిస్తే చరిత్ర సృష్టించేదన్న చంద్రబాబు.. ఇప్పటికే సృష్టించిందని చెప్పారు. అమరావతిని క్రీడల కేంద్రంగా చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎన్టీఆర్.. తాను.. గోపీచంద్ లాంటివాళ్లం చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చామని.. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చే వారిని తాను ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు. భావోద్వేగంగా మాట్లాడిన చంద్రబాబు.. వరాల మీద వరాలు కురిపించటమే కాదు.. క్రీడల విషయంలో పొరుగున ఉన్న కేసీఆర్ తో పోలిస్తే తానెంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. తాను గతంలో ప్రకటించిన రూ.3 కోట్ల నజరానాను చెక్కు రూపంలో సింధుకు అందజేశారు. మొత్తంగా తన మాటలతో చేతలతో.. సింధు సత్కారం విషయంలో కేసీఆర్ ను బీట్ చేసినట్లుగా చెప్పొచ్చు.