కామెడీ కాదు నిజంగానే నిజం. రియో ఒలింపిక్ రజత విజేత సింధుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు షటిల్ ఆడిన ఆసక్తికర ఘటన తాజాగా చోటు చేసుకుంది. సిల్వర్ సింధుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త కామెడీగా.. మరికాస్త ఉత్సాహంగా ఉండటం గమనార్హం.
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సింధు సన్మాన కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు.. నేతలు ఆమెను అభినందిస్తూ పూలమాలలు వేసి.. శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం కల్చరల్ యాక్టివిటీని నిర్వహిచారు. ఇది అయిపోయిన వెంటనే.. మైకులో టీడీపీ ఎంపీ మాగంటి బాబు సిల్వర్ సింధును సత్కరిస్తారన్న అనౌన్స్ మెంట్ వినిపించింది.
వేదిక మీదకు వచ్చిన మాగంటి బాబు ఆమెకు షటిల్ బ్యాట్లు అందజేశారు. ఈ సందర్భంగా రెండు బ్యాట్లు ఇచ్చిన ఆయన.. ఒక బ్యాట్ ను చంద్రబాబు చేతికి ఇవ్వటం.. మరొకరు ఇద్దరూ షటిల్ ఆడతారని ప్రకటించటంతో ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాటకీయ పరిణామానికి మరింత రక్తి కట్టిస్తూ షటిల్ బ్యాట్ ను చేత్తో తీసుకోవటంతో సింధు కూడా రాకెట్ తీసుకుంది.
అలా ఇద్దరూ కాసేపు షటిల్ ఆట ఆడటంతో స్టేడియంలో కూర్చున్న వారంతా హర్షద్వానాలు చేశారు. ఇక.. టీవీల్లో చూస్తున్న వారికైతే ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కాస్త కామెడీగా అనిపించిన పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. సింధుతో చంద్రబాబు షటిల్ ఆడుతుంటే మైకు పట్టుకున్న ఒక వ్యాఖ్యాత దాన్ని ఏపీ ఒలింపిక్స్ గా అభివర్ణించటం లాంటివి కాస్త ఇబ్బందిగా అనిపించాయని చెప్పాలి.
అయితే.. ఇలాంటివేటిని పట్టించుకోని చంద్రబాబు.. హుషారుగా సింధుతో షటిల్ ఆడటం ఒక ఎత్తు అయితే.. సింధు షటిల్ కొడుతున్న దానికి ప్రతిగా చంద్రబాబు కూడా స్పందించిన తీరు చూస్తే.. ఆయన రోజూ ఆట ఆడతారా? అనిపించక మానదు. ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. ఒక సన్మాన కార్యక్రమంలో పండించిన ఈ నాటకీయ పరిణామం ఎవరికి తోచిన విధంగా వారు స్పందించేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి. ఈ సీన్ మీద సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ వస్తుందన్న ఆలోచనే ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.