గోదావరి మహా పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు చంద్రబాబు. అయితే... పుష్కరాల ప్రారంభంలోనే తొక్కిసలాట జరగడంతో కొంత మచ్చ పడినట్లు గా అనిపించినా అది ప్రభుత్వ తప్పిదం కానీ, చంద్రబాబు పొరపాటు కానీ, ఏర్పాట్ల లో లోపం కానీ కాదని... అందులో కుట్ర దాగి ఉందని తెలుస్తుండడం తో తొలుత చంద్రబాబును విమర్శించిన నోళ్లు కూడా మూతపడుతున్నాయి. ఆ ఘటనపై అనుమానాలు, వివరాలు, ఆధారాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంపాదించినా పుష్కరాలు ముగిశాకే దీనిపై విచారణ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో ప్రభుత్వం వైపు నుంచి దీనిపై ఇంకా మూలాల శోధన ఊపందుకోలేదు. పుష్కరాలు ముగుస్తుండడంతో తొక్కిసలాట వెనుక ఉన్న కుట్రనూ బయటపెట్టే దిశగా చర్యలు మొదలు కానున్నాయి. కుట్ర బయటపడి నిందితులెవరో తేలితే చంద్రబాబుపై పడిన ఆ మరకా పోవడం ఖాయం.
చంద్రబాబు సమర్థతకు అన్నిరంగాల ప్రముఖులూ నీరాజనాలు పడుతున్నారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అయితే చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. చంద్రబాబును ఆయన ఆంధ్ర బాహుబలిగా అభివర్ణించారు. 15 కోట్ల మందికి పైగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు బాహుబలి అని ఆయన అన్నారు. సినిమాలోని బాహుబలి కత్తితో పోరాటం చేయగా ఈ బాహుబలి చంద్రబాబు జ్ఞానమే ఆయుధంగా యుద్ధం చేస్తున్నారని అన్నారు. భరణియే కాకుండా పుష్కరాలకొచ్చిన ప్రముఖులంతా అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నేతలు కూడా బయటకు అనలేకపోతున్నా చంద్రబాబు ఘనతను మనసులోనే పొగుడుతున్నారట... కొందరు కుళ్లుకుంటున్నారు కూడా.