రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా విరుచుకుపడేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనను అరెస్ట్ చేస్తే అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదవికి అదే ఆఖరు రోజు అంటూ బడాయి మాట చెప్పారు. చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నేత నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం కాస్తంత చిత్రమైన విషయమే.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్య ఒకటి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్రానికి సీఎం ఏమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం సామాన్యుడేనని వెల్లడిరచారు. దేశంలో చట్టం అందరికి ఒక్కటేనన్నారు.
హైదరాబాద్‌లో పరిమితంగా అయినా ఏపీకి ఉమ్మడి రాజధానే. మరి.. ఏ ఉద్దేశ్యంతో చంద్రబాబు హైదరాబాద్‌లో సామాన్యుడే అని అన్నారన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు గొంతు ఉందని కేటీఆర్ చెబుతున్నప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారన్న దానిపై మాత్రం కేటీఆర్ స్పందించటం లేదు.