చలాకీగా.. చురుగ్గా ఉంటూ కనిపించే కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే.. సీనియర్ నేత భూమా నాగిరెడ్డి అనూహ్యంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై సర్వత్రా షాక్ వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. భూమా నాగిరెడ్డి మరణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ సంచలన వ్యాఖ్య చేశారు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి తీవ్రఆరోపణలు చేశారు. భూమానాగిరెడ్డి మరణానికి బాబు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భూమానాగిరెడ్డిపై.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడినట్లుగా ఆరోపించారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి..ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారని.. ఆ కుటుంబానికి మానసిక వేదననుగురి చేశారన్నారు. టీడీపీలో చేర్చుకొని అవమానాలకు గురి చేసినట్లుగా ఆరోపించారు. మంత్రి పదవిఇచ్చే విషయంలో భూమాకు తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లుగా ఆయన విమర్శించారు.
ఎస్సీ..ఎస్టీ, ఎర్రచందనం కేసుల్నిబనాయించిన చంద్రబాబు తీరుతోనే భూమా మానసిక ఆందోళనకు గురయ్యేలా చేశారని.. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూమా భౌతికకాయాన్నిసందర్శించే అర్హత లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/