సెక్రటేరియట్ తాత్కాలికం...బిల్డింగ్ శాశ్వతం

Update: 2016-02-18 05:21 GMT
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ సచివాలయానికి సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఏపీ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. తాత్కాలక సచివాలయం అంటే.. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ఏర్పాటు చేసి.. అనంతరం శాశ్వత భవనంలోకి మారుస్తారన్న ప్రచారం జరిగింది.

దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగియటం.. బుధవారం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టటం తెలిసిందే. అయితే.. శంకుస్థాపన సమయం వరకూ తాత్కాలిక ఏపీ సచివాలయంగా పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు దానిని శాశ్వత కట్టటంగా పేర్కొనటం గమనార్హం. తుళ్లూరు మండలం వెలగపూడిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న తాజా భవనం ఇప్పటివరకూ తాత్కాలిక భవనంగా ప్రచారం జరగ్గా.. బుధవారం చేపట్టిన శంకుస్థాపన సందర్భంగా ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాను శంకుస్థాపన చేసిన సచివాలయ భవనం శాశ్వత భవనంగా పేర్కొనటం గమనార్హం.

తాత్కాలిక సచివాలయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్లాను మారిపోయింది. ఇందులో భాగంగానే శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత అది తాత్కాలిక సచివాలయం.. కానీ భవనం శాశ్వతం అని బాబు వెల్లడించారు.  మొత్తానికి రెండొందల కోట్లు వేస్టు కావన్న మాట.
Tags:    

Similar News