బాబు లెక్క‌ల్లో లోకేష్ ఎమ్మెల్సీ లాజిక్ ఇది

Update: 2017-03-06 12:27 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారిగా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం, గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం పూర్త‌యిన అనంత‌రం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు  మీడియాతో మాట్లాడారు. పార్టీ నేత‌ల ఆకాంక్ష‌ల అనుగుణంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల జరిగిందని తెలిపారు. పార్టీ కోసం శ్ర‌మించే వారిని - భ‌విష్య‌త్ నేత‌ల‌ను ఎంపిక‌చేయాల‌ని తెలుగుదేశం శ్రేణులు కోరాయ‌ని అందులో భాగంగానే అన్నీ విశ్లేషించి ఎంపిక చేశామ‌ని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. లోకేశ్‌ - బుచ్చుల అర్జునుడు తదితరులు పార్టీ కోసం ఎంతో సేవ చేశార‌ని, నిరంత‌రం పార్టీ కోసం త‌పించార‌ని చంద్ర‌బాబు తెలిపారు. పార్టీకి విధేయత, సామర్థ్యం ఆధారంగా ఎమ్మెల్సీల ఎంపిక జ‌రిగింద‌ని వారు చిత్త‌శుద్ధితో ప‌నిచేయాల‌ని కోరారు.

రాష్ట్ర రాజధాని అమరావతిలో మన గడ్డమీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడం ఓ చరిత్ర అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ విజన్‌ ప్రతిబింబించేలా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం సాగిందని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.  అసెంబ్లీలో గవర్నర్‌ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయేది అని అన్నారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు గవర్నర్‌ ప్రసంగంలో ఉన్నాయని తెలిపారు. దేశ చరిత్రలో ఏక్కడా లేని విధంగా భూ సమీకరణ జరిగిందన్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ ను వినియోగించుకునే అవకాశం ఉన్నా అమరావతి నుంచే పాలన చేయాలనుకున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసమీకరణ చేపట్టామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ ను ఓ మోడల్‌ గా తయారు చేశామని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు. అభివృద్ధి సాధిస్తున్నా ఆర్థికంగా వెనుకబడిన వారికి రేషన్‌ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. అర్హులు ఎవరన్నది తనిఖీ చేశాకే కార్డులు జారీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా పేదలకు అందాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక విజ‌న్ ప్ర‌కారం ముందుకు పోయింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇందులో భాగంగానే పట్టిసీమను పూర్తి చేశామ‌న్నారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి వచ్చేదని చంద్రబాబు విశ్లేషించారు. పట్టిసీమ పూర్తి చేసి సాగు, తాగునీటి కష్టాలను తొలగించే ప్రయత్నం చేశామన్నారు. హంద్రీనివా ద్వారా రాయలసీమలోని ప్రాంతాలకు నీరిస్తున్నామని చంద్ర‌బాబు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News