``బాబుకు ద్వారాలు మూసేశాం...బీజేపీతో కలిసేందుకు ఆయన ఏ ప్రయత్నం చేసినా ఇక వృథాయే``బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - పార్టీ రథసారథులైన నరేంద్రమోదీ - అమిత్ షా లకు సన్నిహితుల్లో ఒకరిగా పేరొందిన రామ్ మాధవ్ ఇటీవల ఏపీలో ఇచ్చిన క్లారిటీ ఇది. అయితే - టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి చేరువ అయ్యే ప్రయత్నాలు మానేశారా? ఆ పార్టీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారా? అనే చర్చకు తాజాగా ఆసక్తికర సమాచారం ప్రచారంలో ఉంది. బీజేపీతో సంబంధాల పునరుద్దరణ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇటీవలే ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తో ఆయన భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల్లో ఓటమి అనంతరం ఒకింత కలవరపడుతున్న చంద్రబాబు...పాత మిత్రులతో సఖ్యతకు ప్రయత్నిస్తున్నారట. బహిరంగంగా కాకపోయినా...అంతర్గతంగా, అంశాల వారీగా జనసేనతో కలిసి సాగుతున్నారనే అప్రపదను ఇప్పటికే మూటగట్టుకున్న చంద్రబాబు ఆ పార్టీ కంటే...పాత దోస్తీ ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే, ఏపీలోని నేతలు తన ప్రయత్నానికి బ్రేక్ వేస్తున్న విషయం గమనించి..ఇంకో రూట్లో నరుక్కు వస్తున్నారట. బీజేపీ మాతృక అయిన ఆర్ ఎస్ ఎస్ తో బీజేపీ పెద్దల మనసును కరిగించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నది తాజా ప్రచారం వెనుక సారాంశం.
ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ఓ కేంద్ర మంత్రి సహాయంతో చంద్రబాబు ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ తో భేటీ అయ్యారట. అది నిజం కాదని....తెలంగాణలో ఉన్న ఓ స్వామీజీ ద్వారానే..చంద్రబాబు ఆర్ ఎస్ ఎస్ రథసారథితో సమావేశం అయ్యారని మరో వాదన ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు తనపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా చూడాలని..వీలుంటే పొత్తుల రూపంలో అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. రాబోయే పురపాలక ఎన్నికలు ఎదుర్కునేందుకు బాబుగారు ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. అయితే, సంఘ్ పెద్దలు ఏ హామీ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. కాగా, బీజేపీ ఈ ఆఫర్‌ను తిరస్కరించనుందని...అందుకే జనసేనతో పొత్తు ద్వారానే బాబు స్థానిక ఎన్నికలను ఎదుర్కుంటారని కొందరు విశ్లేషిస్తున్నారు.