జగన్ పై దాడి..ఈ ప్రశ్నలకు బదులివ్వు బాబూ..

Update: 2018-10-27 06:58 GMT
శకునం చెప్పే బల్లి కుడిదిలో పడ్డట్టు అయ్యింది చంద్రబాబు పరిస్థితి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ.. నిందితుడిని కాపాడేందుకు టీడీపీ సర్కారు చెబుతున్న అబద్దాలు - అవాస్తవాలు అభూతకల్పనలు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. వైఎస్ జగన్ పై హత్యాయత్నంను పక్కదారి పట్టేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు అండ్ కోకు ఇప్పుడు పలు సందేహాలు - ప్రశ్నలకు మాత్రం జవాబు కరువవుతోంది. కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ అబద్ధాలు చెబుతున్న వారు కొన్ని కీలకమైన విషయాలను మరిచిపోవడం అనుమానాలకు తావిస్తోంది..

వైఎస్ జగన్ పై హత్యయత్నంలో ఏపీ ప్రభుత్వం విస్మరించిన కీలక విషయాలివీ..

*వీవీఐపీ భద్రత ఉండే ఎయిర్ పోర్టులోకి కోడిపందేలా కత్తులు ఎలా వచ్చాయనేది అంతుచిక్కడం లేదు.

*వైఎస్ జగన్ పై దాడి జరుగుతున్న స్థానిక పోలీసులు ఎందుకు కళ్లు మూసుకొని ఉన్నారన్నది అనుమానంగా మారింది.

*నిందితుడు జగన్ పై దాడి చేశాక సీఐఎస్ఎఫ్ తనిఖీల్లో ఒకటే కత్తి బయటపడింది. మరి ఆంధ్రా పోలీసులు మరో కత్తి చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. అది ఎలా లోపలికి వెళ్లిందంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు.

*టీడీపీ నేత రెస్టారెంట్లో నిందితుడు శ్రీనివాస్ ను  పక్కా ప్రణాళికతోనే పనికి కుదర్చిరా.? మరి ఆ రెస్టారెంట్ ఓనర్ ను పోలీసులు ఎందుకు విచారించడం లేదనేది అంతుబట్టడం లేదు.

* ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి చేసేసి ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టివేయాలని పథకం పన్నారా.?

*నిందితుడి జేబులో లేఖ పెట్టిందెవరు.?

వైఎస్ జగన్ పై దాడి చేశాక అక్కడి సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకొని తనిఖీ చేయగా ఒక్క కోడిపందేలా కత్తి మాత్రమే లభించింది. అతడి వద్ద ఎలాంటి లేఖ లేదు. మరి ఏపీ డీజీపీ ఠాకూర్ చెబుతున్నట్టు జేబులోకి లేఖ ఎలా వచ్చిందనేది అంతుచిక్కడం లేదు. శుక్రవారం ఆ లేఖను వేర్వేరు వ్యక్తులతో రాయించాడని.. అది శ్రీనివాస్ హ్యాండ్ రైటింగ్ కాదంటూ పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

*గుమ్మడికాయ దొంగలా ఉలికిపాటేందుకు.?

 వైఎస్ జగన్ పై దాడి జరిగాక ఏపీ సీఎం చంద్రబాబు గుమ్మడికాయ దొంగలా హత్యాయత్నానికి ప్రభుత్వానికి - టీడీపీకి సంబంధం లేదనడం.. జగన్ ను తిట్టడం పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విచారణను తప్పుదోవ పట్టేంచేలా చాలా పన్నాగాలను పన్నడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.  వైఎస్ జగన్ ఆస్పత్రికి వెళ్లడం.. హైదరాబాద్ లో చికిత్స.. ఢిల్లీ నుంచి ఫోన్లపై అబద్దాలు ప్రచారం చేయడం ఏమిటీని ప్రశ్నిస్తున్నారు.

*శివాజీని లోపలేసి చెప్పించొచ్చు కదా..

నటుడు - రాజకీయ నేత శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ ప్రకారం అంతా జరుగుతుందని చెప్పిన చంద్రబాబు.. ఆయన్ను అరెస్ట్ చేయించి సూత్రధారులెవరు విచారించవచ్చు కదా అని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విచారణను ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

*గవర్నర్ ఫోన్ చేస్తే కంగారెందుకు.?

గవర్నర్ తన పాలనలో ఇన్ వాల్వ్ అయ్యాడని.. డీజీపీకి ఫోన్ చేశాడని గగ్గోలు పెడుతున్న బాబు.. దీన్ని జాతీయ స్థాయి లో ఎండగడుతానని అంటూ కొత్త డ్రామాకు తెరతీయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వాధినేతగా గవర్నర్ కు నివేదిక కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు..

*ఆఖరుకు పరామర్శిస్తే తప్పేనా..?

వైఎస్ జగన్ చావు తప్పి బతుకుజీవుడా అంటూ తప్పించుకుంటే దాన్ని రాజకీయం చేయడం బాబుకు సరికాదని వైసీీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పరామర్శిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ - ఇతర పార్టీల నేతల తీరుపై అభ్యంతరం చెప్పడం బాబు నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు.
Tags:    

Similar News