గోదావరి పుష్కరాలు మొదలైన నాటినుంది చిన్న చిన్న వి పెద్ద వి ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది! తొలిరోజు తొక్కిసలాట, తాజాగా రేవుకి దగ్గరలో అగ్నిప్రమాదం ఇలా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. అయినా కూడా ప్రభుత్వ పట్టుదలను కానీ, భక్తుల ఆత్మవిశ్వాసాన్ని కానీ దెబ్బతీయలేకపోతున్నాయి!
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే పెద్ద ప్రమాదం తప్పింది! గోదావరి పుష్కరాలను పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది! అయితే డ్రైవర్లు అప్రమత్తతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి! పుష్కరాల పరిశీలనలో భాగంగా టూరిజం ప్రాంతం నుంచి వీఐపీ ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్‌ను పరిశీలించి అక్కడి నుండి కొవ్వూరు తిరుగుప్రయాణమవుతున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటు - మీడియావారు ప్రయాణిస్తున్న లాంచి ఒకదానినొకటి ఢీకొన్నాయి! అదృష్టవసాత్తు డ్రైవర్ల అప్రమత్తతతో పెనుప్రమాధం తప్పింది! ఈ సమయంలో ఆ బోటులో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం - యనమల రామకృష్ణుడు - నారాయణ - మురళీమోహన్ - స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు! ప్రమాదం తప్పడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు!