బలం లేకున్నా.. బరిలోకి దించటం బాబుకు కొత్తేం కాదు. తనది కాని స్థానాల్ని సొంతం చేసుకోవటానికి ఆయప విపరీతంగా తపిస్తుంటారు. అధికార.. ఆర్థిక బలాన్ని మిక్స్ చేసి.. న్యాయంగా తమకు లభించిన వాటి కంటే అదనపు పదవులు దక్కించుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు.
ఈ కక్కుర్తే బాబును.. ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యేలా చేసిందన్న విమర్శ ఉంది. లేని బలాన్ని ప్రదర్శించాలన్న తపన.. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలన్న ఆత్రం లేనిపోని కష్టాల్ని తెచ్చి పెట్టటమేకాదు.. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను అదరాబాదరాగా వదిలేసి అమరావతికి వెళ్లేలా చేసింది.
గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరించారు చంద్రబాబు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని నిలిపిన ఆయన.. మరొక స్థానానికి పోటీ పెట్టలేదు. మొదట్లో మూడో స్థానం మీద కన్నేసిన బాబు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరో రాజ్యసభ స్థానం మీద మక్కువ ప్రదర్శించలేదు.
వాస్తవానికి మూడో సీటు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అయినప్పటికీ మిత్రుల బలాన్ని తీసుకొని.. తొండి ఆట ఆడి మూడోది కూడా తమకే చెందేలా పావులు కదపాలని బాబు భావించినట్లు తెలుస్తోంది. అయితే.. కేంద్రం నుంచి మంత్రుల్ని ఉపసంహరించుకోవటం.. మోడీ సర్కారుతో టర్మ్స్ సరిగా లేని వేళ.. కొత్త తలనొప్పులు తెచ్చుకునే కన్నా.. మూడో సీటును వదిలేయాన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
మూడో సీటును సొంతం చేసుకోవాలంటే.. ఎన్నికలకు సిద్ధం కావాలి. అందులో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం రావటమే కాదు.. అపకీర్తిని.. విమర్శల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే.. అంత రిస్క్ లేకుండా ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నికల ఎపిసోడ్ ముగియాలని భావించినట్లుగా చెబుతున్నారు.
మూడో స్థానంలో పోటీ చేయకున్నా.. బయటవారికి మద్దతు ఇవ్వాలని బాబు అనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసర వివాదాల్ని ఆహ్వానించే కన్నా.. సాఫీగా రాజ్యసభ ఎన్నికలు ముగిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. ఈ కారణంతోనే మూడో అభ్యర్థిని బరిలోకి దింపలేదన్న మాట వినిపిస్తోంది. కక్కుర్తి పడకుండా.. వెనక్కి ఒక అడుగు వేసిన బాబు.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. లేని దాని కోసం ఆరాటపడటం తనకు ఇష్టం ఉండదని.. మూడో అభ్యర్థికి సరిపోయినన్ని ఓట్లు లేనప్పుడు పోటీకి అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. ఇన్ని నీతులు గతంలో ఏమైనట్లు? ఎక్కడికి వెళ్లినట్లు..?