అగ్రిగోల్డ్ భూముల్ని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన వైనాన్ని తప్పు పడుతూ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ ఉదంతంలో తాను తప్పు చేసినట్లు తేలితే.. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి సవాలు విసిరి.. దానికి స్పందించాలని జగన్ ను సవాల్ విసిరారు. దీనికి స్పందించిన జగన్.. ఈ ఇష్యూ మీద సింగిల్ బెంచ్ జడ్జిని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగన్ డిమాండ్‌ను పక్కన పెట్టి.. మంత్రి విసిరిన సవాల్ మీదనే స్పందించాలంటూ నిన్నటి నుంచి ఏపీ అధికారపక్షం చేస్తున్న హడావుడి చూస్తున్నప్పుడు.. కొత్త సందేహాలు పుట్టుకు రాక మానవు.
మొన్నటికి మొన్న జగన్ ఆస్తులపైనా.. కేసులు పైనా ఏపీ అధికారపక్ష నేతలు ఆరోపణలు చేయటం.. దానికి స్పందించిన జగన్.. తన ఆస్తులకు సంబంధించి టీడీపీ నేతలు ఆరోపించిన రూ.40వేల కోట్లలో పదిశాతం తనకు ఇస్తే.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానని సవాల్ విసిరారు.
ఈ రోజు ప్రత్తిపాటి ఇష్యూలో సవాలుకు కట్టుబడి ఉంటారా? లేదా? అంటూ అదే పనిగా మాట్లాడుతున్న వారంతా.. ఇదే సూత్రాన్ని అన్ని విషయాలకు ఎందుకు అమలు చేయరన్నది ప్రశ్న. సవాలు విసిరిన ప్రతిసారీ ఇంతే కట్టుబడి ఏపీ ముఖ్యమంత్రి బాబు అండ్ కో ఉంటే బాగుంటుంది. కానీ.. అదేమీ లేకుండా ఉండటం చూసినప్పుడు బాబు బ్యాచ్ మాటలు కాస్త వింతగా.. విచిత్రంగా ఉంటాయనటంతో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/