కోడెల మరణించడం ఆయన అభిమానులకు - ఆయన కుటుంబీకులకు - తెలుగుదేశం వీరాభిమానులకు విషాదకరమే. అయితే కోడెల మృతిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయానికి అనుగుణంగా ఉపయోగించుకుంటున్న తీరు మాత్రం వివాదం అవుతోంది. కోడల శివప్రసాద్ మీద వసూళ్ల ఆరోపణలు ఏమీ లేవు. ఆయన కొడుకు - కూతురు మీదే ఈ విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి క్రమంలో వారిపైనే కేసులు నమోదు అయ్యాయి కూడా. కోడెల మీద పెద్దగా కేసులు నమోదు కాలేదు. అయినా ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడంతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారంటూ చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు. కేసులు పెట్టింది కోడెల కూతురు - కొడుకుల మీద. అయితే ఆత్మహత్య చేసుకుంది కోడెల.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీరు నెటిజన్ల మధ్యన చర్చగా మారుతూ ఉంది కూడా. కోడెల శివప్రసాద్ రావు కూతురు - కొడుకులు కే ట్యాక్స్ వసూలు చేశారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అందుకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులకూ - కోడెల మృతికి ముడిపెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. దీంతో ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకుంటున్నట్టు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.
కే ట్యాక్స్ వసూలు చేయడాన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? కోడెల కొడుకు - కూతురు మీద కేసులు నమోదు చేయడం తప్పా? బాధితులు ఫిర్యాదులు చేయకూడదా? వాళ్లు వసూలు చేస్తుంటూ డబ్బులు చెల్లించుకోవాలా? కోడెల ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఆయన వ్యక్తిగతంగా కనిపిస్తున్న నేపథ్యంలో - దానికీ కేసులకూ ముడిపెట్టడం ఏమిటి? చంద్రబాబు నాయుడు కే ట్యాక్స్ లు చెల్లించుకోవాల్సిందే కానీ - ఎవ్వరూ మారు మాట్లాడకూడదు - ప్రభుత్వం కూడా కామ్ గా ఉండిపోవాలని.. చెబుతున్నట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.