దీప‌క్ రెడ్డి సంగ‌తేంది బాబు?

Update: 2017-06-09 09:09 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడే ఆయ‌న ప‌రిస్థితి బాగుండేద‌న్న మాట‌కు బ‌లం చేకూరుస్తూ తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇప్ప‌డు పార్టీలో కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. పూర్తి స్థాయిలో మెజార్టీ చేతిలో ఉండ‌టంతో సంతృప్తి చెంద‌ని చంద్ర‌బాబు.. విప‌క్షానికి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల్ని తెచ్చుకున్న త‌ర్వాత కూడా ఆయ‌న బ‌ల‌మైన అధినేత‌లా అవ‌త‌రించ‌క‌పోవ‌టం ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఏపీలో తిరుగులేని శ‌క్తిగా చంద్ర‌బాబును ప‌లువురు అభ‌వ‌ర్ణిస్తున్నా.. అంత సీన్ లేద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. మొన్న‌టికి మొన్న నెల్లూరుకు చెందిన పార్టీ ఎమ్మెల్సీ నారాయ‌ణ రెడ్డిపై అవినీతి మర‌క ప‌డ‌టం.. ఆయ‌న ఆస్తుల‌పై అధికారులు దాడులు చేయ‌టం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న మ‌చ్చ పార్టీ మీద ఎక్క‌డ ప‌డుతుందోన‌న్నఆలోచ‌న‌తో ఆయ‌న‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు చంద్ర‌బాబు.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఆ నిర్ణ‌య‌మే ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. నారాయ‌ణ‌రెడ్డి మీద వేటు వేసిన‌ట్లే.. ఇప్పుడు భూక‌బ్జా ఆరోప‌ణ‌లుతో జైలుకు వెళ్లిన మ‌రో ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి మీద కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న చ‌ర్చ పార్టీలో సాగుతోంది. నారాయ‌ణ‌రెడ్డి మీద సింఫుల్ గా వేటు వేసిన బాబు.. అదే తీరులో దీప‌క్ మీద యాక్ష‌న్ తీసుకోలేర‌ని చెబుతున్నారు. దీప‌క్‌ ను ట‌చ్ చేస్తే.. ప‌వ‌ర్ ఫ్లాంట్ లాంటి జేసీని ట‌చ్ చేసిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

దీంతో.. భూక‌బ్జా కేసుల్లో అరెస్ట్ అయి ఏపీ అధికార‌ప‌క్షానికి భారీగా డ్యామేజ్ చేసిన దీప‌క్ రెడ్డిపై చ‌ర్య‌లు లేక‌పోవ‌టం ప‌లువురు టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటివి ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ ఇమేజ్‌ ను దెబ్బ తీస్తాయ‌ని వాదిస్తున్నారు. న‌కిలీ ప‌త్రాల్ని సృష్టించి.. భూముల్నిక‌బ్జా చేసిన ఆరోప‌ణ‌ల‌తో దీప‌క్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేయ‌టం తెలిసిందే.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తెర మీదకు వ‌స్తున్న పార్టీ నేత‌ల భాగోతాలు బాబుకు శిరోభారంగా మారితే.. దీప‌క్ రెడ్డి లాంటి వారి మీద చ‌ర్య‌లు తీసుకోలేని రీతిలో బాబు ప‌రిమితుల బంధీఖానాలో ఉండ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఉండేది కాద‌ని చెబుతున్నారు. అధికార ప‌క్ష అధినేత‌గా ఉన్న‌ప్ప‌టితో పోలిస్తే.. విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు బాబు ప‌వ‌ర్ ఫుల్ గా ఉన్నార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర పార్టీల‌కు జేసీ లాంటి నేత‌ల్ని తెచ్చుకున్నందుకు బాబుకు జ‌ర‌గాల్సిన శాస్తి జ‌రిగింద‌న్న మాట‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దీప‌క్ రెడ్డి ఉదంతం పార్టీలో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన స‌మ‌యంలో దీప‌క్ ఆస్తులు అంద‌రిని విశేషంగా ఆక‌ర్షించాయి. 2012 ఉప ఎన్నిక‌కు కాస్త ముందుగా పార్టీలో చేరిన దీప‌క్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో త‌న‌కు రూ.6781 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉండ‌గా.. ఇంత భారీ ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ.. అవ‌న్నీ వివాదాల్లో ఉండ‌టం.. ఇలాంటి నేత‌ల‌కు బాబు ప్రాధాన్యం ఇవ్వ‌టం ఏమిట‌న్న విమ‌ర్శ‌ల‌కు తెలుగు త‌మ్ముళ్లు స‌మాధానాలు చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్నార‌ని చెబుతున్నారు. త‌మ్ముళ్ల ప‌రిస్థితే కాదు.. బాబు ప‌రిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు. దీప‌క్ మీద చ‌ర్య‌లు తీసుకుంటే జేసీకి ఆగ్ర‌హం వచ్చే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే ఆయ‌నీ విష‌యం మీద మౌనంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఇందులో నిజానిజాలేమిట‌న్న‌ది ఇప్ప‌డు పెద్ద ప్ర‌శ్న‌గా మారాయని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News