ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. తెలంగాణలో పొత్తులుంటాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైనట్లే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా మంత్రులు - సహచరులతో అంటున్నారు. కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పడు అక్కడ ఆయన ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలు కూడా వేసారు. అది ఈనాటి పొత్తుకు సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. మంగళవారం నాడు అమరావతిలో పార్టీ సహచరులు - మంత్రులతో జరిపిన సమావేశంలో తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు నాయుడు పూర్తి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తాం అని నర్మగర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన వారితో నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు నాయుడు తన అధికారం కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన వారితో ఎలా కలుస్తారని ప్రజల్లో ఆగ్రహం బయలుదేరింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు.
ప్రత్యేక హోదాపై నాలుగు సంవత్సరాలు తాత్సరం చేసిన చంద్రబాబు నాయుడు నిజానికి భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం చేశారని ఎపీ ప్రజల భావన. ఆయన కంటే ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెయ్యి రెట్లు మంచిదనే భావన ప్రజల్లో ఉందని - చంద్రబాబు నాయుడు చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు దూరం కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్ పర్యటనలకు లక్షలాది మంది తరలి రావడం - తన మంత్రులు - పార్టీ నాయకుల్లో పెరిగిన అవినీతి వంటి వాటి వల్ల ఈసారి అధికారానికి చంద్రబాబు నాయుడు దూరం కావడం ఖాయమని వారంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడ్ని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగితే వారికి కూడా నష్టమేనని వారంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేననే భావన తెలంగాణ వాసుల్లో ఉంది. అలాగే ఎపీకి ప్రత్యేక హోదా కావాలంటున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో మాత్రం విరోధిలా ఉంటున్నారని, అలాంటి పార్టీతో కలిస్తే కాంగ్రెస్‌కు నష్టమే తప్ప లాభం ఉండదనేది మరో వాదన. ఒకవేళ చంద్రబాబు నాయుడి పొత్తులు ఖరారైతే మాత్రం ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు.