అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌..బాబు రేటింగ్ పెరిగిందా..?

Update: 2019-11-30 01:30 GMT
రాత్రికి రాత్రి త‌న మ‌న‌సులో వ‌చ్చిన ఆలోచ‌న‌ను ఆచర‌ణ‌లో పెట్టేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో ప‌ర్యటించేశారు. హంగు ఆర్భాటాలు ముందు వ‌ద్ద‌ని అనుకున్నా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు - చ‌ర్చ‌ల నేపథ్యంలో విస్తృత స్తాయిలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. జాతీయ మీడియాను పిలిచినా.. పెద్ద‌గా స్పందించ‌క పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. స‌రే! బాబు అనుకున్న‌ది చేసేశారు. అయితే, అమ‌రావ‌తి ప‌ర్య‌టన అంత ఈజీ అని చంద్ర‌బాబు కూడా అనుకోలేదు. త‌న ప‌ర్య‌ట‌న‌తో లాభ‌ న‌ష్టాల‌ను ఆయ‌న భేరీజు వేసుకున్నారు. ప్ర‌స్తుతం పార్టీ ఐసీయులో ఉంది. దానికి ఫుల్‌ గా ఆక్సిజ‌న్ అందించాలి.

అదే స‌మ‌యంలో పార్టీలోని ఓ వ‌ర్గం ఏకంగా త‌న నాయ‌క‌త్వ‌ంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఫుల్ స్టాఫ్ పెట్టాలి. అంటే.. నాయ‌కుడిగా త‌న‌లో స‌త్తా చ‌చ్చిపోలేదని - మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు కూడా పూర్తిగా తానే చ‌క్రం తిప్ప‌గ‌ల స‌త్తా త‌న‌కు ఉంద‌ని బాబు నిరూపించుకోవాల్సిన త‌రుణం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు స‌మ‌స్య‌ల‌కు ఒకే ప‌రిష్కారంగా బాబు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌ అనే ఐడియాను వేశారు. నిజానికి ఈ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కానీ - ప్ర‌ణాళిక కానీ - ఏదో వారం ముందుగా ప్రిపేర్ చేసుకున్న‌ది కాదు. కేవ‌లం రాత్రికి రాత్రి నిర్ణ‌యించుకుని చేసింది.

ఈ క్ర‌మంలోనే జాతీయ మీడియాకు కూడా ఆహ్వానం పంపారు. ఇప్ప‌టి  వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. నిర‌స‌న‌లు చేశారు. అవ‌న్నీ కూడా స్థానిక స‌మ‌స్య‌లే. లేదా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న‌వే. కానీ, రాజ‌ధాని వ్య‌వ‌హారం మాత్రం ఏ రాష్ట్రంలోనూ లేదు. పైగా జాతీయ స్తాయిలో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ప్రొజెక్ట్ అయిన ప్రాంతం. ప్ర‌దాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా వ‌చ్చి ఇక్క‌డ శంకు స్థాప‌న చేసిన వ్య‌వ‌హారం అలాంటి ప్రాంతంలో తాను ప‌ర్య‌టించ‌డం ద్వారా.. త‌న కు మ‌ళ్లీ జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుంద‌ని బాబు అనుకున్నారు.

అయితే, నిన్న‌టికి నిన్న మ‌హారాష్ట్రలో సీఎం శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ప్ర‌మాణ స్వీక‌రం ఉండ‌డంతో జాతీయ మీడియా దానిపైనే దృష్టి పెట్టింది. దీంతో ఏపీకి ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ రాలేదు. స్థానిక మీడియా మాత్రం ఇక్క‌డే ఫోక‌స్ చేసినా.. బాబు పై రాళ్ల‌దాడి - చెప్పుల దాడి - త‌ర్వాత ఒక్క‌సారిగా జ‌గ‌న్ మంత్రులు అంద‌రూ ఏక‌బిగిగా.. విరుచుకుప‌డ‌డం - మ‌రోప‌క్క‌ - జ‌గ‌న్ బీసీల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో బాబు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న 50 ప‌ర్సెంట్ మాత్ర‌మే క‌వరైంది. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. అనుకున్న నేత‌లు పిలిచిన నాయ‌కులు పెద్ద‌గా రెస్పాండ్ కాలేదు. దీంతో బాబు ప‌ర్య‌ట‌న స‌క్సెస్ అయినా.. ఫ‌లితం మాత్రం ఆశించ‌న విధంగా ద‌క్క‌లేద‌ని వాపోతున్నారు త‌మ్ముళ్లు.
Tags:    

Similar News