కేంద్ర బడ్జెట్ ఏపీ సీఎం చంద్రబాబును అన్ని రకాలుగా ఇరుకునపెడుతోంది. ఈ బడ్జెట్‌తో ఏపీకి ఏమీ ప్రయోజనం లేకపోయినాప్పటికీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అలా అని మాట్లాడకపోతే కేంద్రం చేసిన అన్యాయం జనానికి తెలియకపోగా చంద్రబాబు అశక్తత అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో విపక్ష నేత జగన్మోహనరెడ్డి రూపంలో చంద్రబాబుకు మరో షాక్ తగులుతోంది. మోదీ కేబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉండగా బడ్జెట్ గురించి చంద్రబాబుకు తెలియకుండా ఉండదన్న జగన్ లాజిక్ వాస్తవమేనని తెలుస్తోంది.
నిజానికి బడ్జెట్ తయారీ విధానం పరిశీలిస్తే కేబినెట్ మంత్రులకు చాలావరకు సమాచారం ఉంటుందని అర్థమవుతోంది. సెప్టెంబరులోనే బడ్జెట్ ప్రక్రియ మొదలవుతుంది. అన్ని మంత్రిత్వశాఖలకు ఆర్థిక శాఖ నుంచి గైడ్ లైన్స్ అందుతాయి. దాని ప్రకారం వారు ఆయా శాఖల రాబడి, ఖర్చుల వివరాలు... బడ్జెట్ లో పెట్టాల్సిన అంశాలను ఇస్తారు. దానిపై ఆర్థిక మంత్రి అధికారుల సలహాలు తీసుకుని తాను ఒక నిర్ణయానికి రావడంతో పాటు ప్రధానిని కలిసి తుది నిర్ణయానికి వస్తారు.
బడ్జెట్ కి తుది రూపు ఇస్తున్న దశలో ప్రధాని, ఆర్థిక మంత్రి కలిసి మిగతా అందర మంత్రులతో సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే బడ్జెట్ ఎలా ఉండబోతుందన్నది అర్థమైపోతుంది. ఆయా మంత్రిత్వ శాఖల ప్రతిపాదనకుల ఎంతవరకు స్థానం దక్కింది అన్నదీ అవగాహనకు వస్తుంది. మోదీ కేబినెట్లో టీడీపీ మంత్రులూ ఉండడంతో బడ్జెట్ ముచ్చట్లు చంద్రబాబుకు తెలియకుండా పోవు. కానీ... బడ్జెట్ సమర్పించిన తరువాత చంద్రబాబు కూడా అందరిలానే ఆశ్చర్యపోవడం, విమర్శించడమే విడ్డూరం.
ఇక మోదీ కేబినెట్లోని టీడీపీ మంత్రుల విషయానికొస్తే సుజనాచౌదరి కాస్త బడ్జెట్ పై అసంతృప్తి చూపించినా దాన్ని మళ్లీ కవర్ చేశారు. ఏపీకి రావాల్సినవి బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇస్తారని చెప్పారు. బడ్జెట్లో అన్నీ పెట్టాలన్న రూలేమీ లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. మరో మంత్రి అశోక్ గజపతి మాత్రం దీనిపై పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. కానీ.. కేంద్ర బడ్జెట్ గురించి ఒక్క మాట కూడా అనలేదు. కానీ, చంద్రబాబు మాత్రం కేంద్రంపై రుసరుసలాడుతున్నారు.